గెలుపే లక్ష్యంగా…

Read Time: 1 minutes

తెలంగాణ ఇచ్చిన పార్టీగా, రానున్న సాధార‌ణ ఎన్నిక‌లకు సెమీస్ గా భావిస్తోన్న ఈ ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా గెలిచి తీరాల‌న్న ఆలోచ‌న‌తో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే… ఆ పార్టీ అబ్య‌ర్థుల జాబితా చూస్తే, ఇదే అంశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

బీసీల‌కు ఇవ్వాల‌ని కొంద‌రు, ఎస్సీల‌కు స‌ముచిత ప్రాధాన్యం… ఇలా ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌, త‌మ వ‌ర్గాల కోసం ప్ర‌య‌త్నించారు. కానీ ఓ రాజ‌కీయ పార్టీగా… వారిని గౌర‌విస్తూనే, గెలుపు కోసం ప‌నిచేయాలి. లేక‌పోతే… ఆపార్టీ క‌నుమ‌రుగుకాక త‌ప్ప‌దు. గ‌త ఎన్నిక‌లు నేర్పిన పాఠాన్ని గ‌మ‌నించిన కాంగ్రెస్ పెద్ద‌లు, రాష్ట్ర నాయ‌క‌త్వం క‌న్నా… త‌మ అంచ‌నాతోనే అబ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఎలాంటి ఒత్తిళ్ల‌ను ప‌ట్టించుకోకుండా, కేవ‌లం  వార‌సులు అన్నందుకే అని కాకుండా… గెలుపు గుర్రాల‌నే ఎంచుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. అందుకే, ఎలాంటి ఒత్తిళ్ల‌ను ప‌ట్టించుకోలేదు. కేవ‌లం… కూట‌మి పొత్తుల వ‌ల్ల ఎవ‌రైనా… బ‌ల‌మైన నాయ‌కుల‌కు అన్యాయం జ‌రుగుతుందా, అలాంటి ప‌రిస్థితి ఉంటే… ఎలా ఆ నేత‌ల‌ను కాపాడుకోవాలన్న కోణంలోనే ఇంత‌వ‌ర‌కు ప‌నిచేసిందని, అందుకే ఆల‌స్యం అయింద‌ని తెలుస్తోంది.

ఇక పొత్తుల‌తో… కూట‌మిలోని పార్టీల‌కు కూడా సింగిల్ నైట్ లో స్ప‌ష్ట‌త ఇచ్చేసింది రాహుల్ టీం. సోనియా– రాహుల్ భేటీ ముగిసిన గంట‌లోనే కాంగ్రెస్ జాబితా విడుద‌ల‌యింది. వెంట‌నే టీడీపీ కూడా త‌న జాబితాను ప్ర‌క‌టించేసింది. దీన్ని బ‌ట్టి అర్థః చేసుకోవ‌చ్చు… కూట‌మిలోని పొత్తులే కాదు, త‌మ అబ్య‌ర్థుల విష‌యంలో… కాంగ్రెస్ అధిష్టానం ఎంత కీన్ గా ఉందో. ఇది గ‌తంలో కాంగ్రెస్ పార్టీ విధానాల‌కు భిన్నం అని, రాహుల్ మార్క్ క‌న‌ప‌డుతోందంటున్నారు విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*