గ్రేట‌ర్ ప్ర‌చారం వ‌ర‌కే ప‌రిమితం కానున్న చంద్ర‌బాబు….?

Read Time: 0 minutes

తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌హ‌కూట‌మి సీట్ల కేటాయింపు, పొత్తుల అంశం తుది ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో… ఇక ప్ర‌చారం పై దృష్టిపెట్టింది కాంగ్రెస్ కూట‌మి. ఇప్ప‌టికే టీఆర్ఎస్ ప్రచారంలో 50 రోజులు పూర్తిచేసుకున్న త‌రుణంలో, ఇంకా ఆల‌స్యం చేయ‌కుండా… దీపావ‌ళి పండ‌గ పూర్త‌యిన వెంట‌నే, ప్రచారంలోకి దూక‌బోతున్నారు.

అయితే… ఇప్ప‌టికే ప్ర‌చార క‌మిటీ, స్టార్ క్యాంపెయిన‌ర్ ను నియ‌మించిన కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం, దానికి తోడుగా… మరిన్ని ప్ర‌చార గ్రూపుల‌ను ఏర్పాటు చేసి… కీ లీడ‌ర్ల‌కు బాద్య‌త అప్ప‌గించారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్. అయితే…  మ‌హ‌కూట‌మి త‌రుపున ఉమ్మ‌డిగా ప్ర‌చారం చేసే అవ‌కాశ‌మున్న నేప‌థ్యంలో… టీడీపీ చంద్ర‌బాబు ప్ర‌చారాన్ని కోరుకుంటుంది. చంద్ర‌బాబు కూడా ప్ర‌చారం  చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ, చంద్ర‌బాబు ప్ర‌చారం గ్రేట‌ర్ ప‌రిధికే ప‌రిమితం చేయాల‌ని, అవ‌ర‌స‌ర‌మ‌యితే… సెటిల‌ర్ ఓట్ బ్యాంకు ఎక్క‌వ‌గా ఉన్న ఇత‌ర జిల్లాల్లో ప్ర‌చారానికి వినియోగించుకోవాల‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. తెలంగాణ మొత్తం ప్ర‌చారానికి చంద్ర‌బాబు వ‌స్తే… కేసీఆర్ కు అడ్డులేకుండా పోతుంద‌ని, విభ‌జ‌న స‌మ‌స్య‌లతో పాటు నీళ్ల పంచాయితీ, క‌రెంటు స‌ర‌ఫ‌రా తెర‌పైకి తెచ్చి… ప్ర‌భుత్వ చేత‌గానిత‌నం అంశాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారు. అదే గ‌నుక జ‌రిగితే… మొద‌టికే ప్ర‌మాదం వ‌స్తుంద‌ని, ఎట్టిప‌రిస్థితుల్లోనూ… సీమాంద్ర ప్రాంత ఓటర్లున్న వ‌ర‌కే చంద్ర‌బాబును ప‌రిమితం చేసేలా చూడాల‌ని కోరుతున్నారు. అప్పుడు చంద్ర‌బాబును… కేసీఆర్ తిట్టిపోసే ప్ర‌మాదం త‌క్కువ‌గా ఉంటుంద‌ని, చివ‌ర‌కు అది కూట‌మికి మేలు చేస్తుంద‌ని వారి వాద‌న‌.

మ‌రీ… కాంగ్రెస్ ఆద్వ‌ర్యంలోని కేంద్ర కూట‌మిలో కీల‌కంగా మారుతోన్న బాబును గ్రేట‌ర్ వ‌ర‌కే  కంట్రోల్ చేసే ప‌రిస్థితి ఉంటుందా అన్న‌ది కూడా ఇప్పుడు ఆస‌క్తిగా మారుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*