గ్రేట‌ర్ లో సీమాంద్ర ఓట‌ర్ల ప్ర‌భావం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలివే.

Read Time: 0 minutes

ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉండి, తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం అయ్యాక కూడా సీమాంద్ర ప్రాంతం నుండి వ‌చ్చి, ఇక్క‌డ సెటిల‌యిపోయిన ప్ర‌జ‌లు కొన్ని సీట్ల‌పై ప్ర‌భావం చూపుతున్నారు. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర జిల్లాల్లోని కొన్ని చోట్ల వారి ప్ర‌భావం ఎక్కువ గా ఉండ‌నుంది.

ముఖ్యంగా కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో సీమాంద్ర ప్రాంత ప్ర‌భావం ఎక్కువగా ఉండ‌నుంది. తెలంగాణ‌లో ఉన్న ఆంద్రా ప్రాంతం అంటూ గ‌తంలో జోకులు వేసేవారు. అక్క‌డ ఉన్న ఓట‌ర్ల‌లో… ఎక్కువ మంది సీమాంద్ర‌ ఖ‌మ్మ‌, కాపుల డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. మెజారిటీ ప్ర‌జ‌లు బ‌య‌టి నుండి వ‌చ్చి, సెటిల‌యిన వారే. అందుకే మొత్తం గ్రేట‌ర్ జోన్ల‌లో… ఒక్క కూక‌ట్ ప‌ల్లిలో మాత్ర‌మే టీడీపీ కౌన్సిల‌ర్ అబ్యర్థి గెలిచారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక రాజేంద్ర‌న‌గ‌ర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లిలో సీమాంద్ర ప్ర‌జానీకం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక్క‌డ వీరు ఎవ‌రివైపు ఉంటే… ఆ పార్టీ అబ్య‌ర్థులు గెలిచిన‌ట్లే. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీట్ల‌లో టీడీపీ అబ్య‌ర్థులే భారీ మెజారిటీతో గెలుపొందారు. అందుకే ఇప్పుడు కూడా టీడీపీ  ఆ సీట్ల‌పై పేచిపెడుతోంది. ఇక్క‌డ అధికంగా ఉండే ఖ‌మ్మ‌, కాపు, రాజుల సామాజిక వ‌ర్గాల‌తో పాటు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, వైజాగ్ స‌హా ఇత‌ర సీమాంద్ర నుండి వ‌చ్చిన ప్రాంతాలు ప్ర‌జ‌లు ఇక్క‌డే అధికంగా ఉంటారు.

ఇక్క‌డ కుల‌, మతాల ప్ర‌భావం క‌న్నా ప్రాంతీయ ప్ర‌భావం ఎక్క‌వుగా ఉంటుంది. టీఆరెసేత‌ర ప‌క్షాల్లో  ఏపీలో ఎవ‌రు అధికారంలో ఉంటే ఆ పార్టీ అబ్య‌ర్తులు ఇక్క‌డ గెలిచే అవ‌కాశం ఉంటుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*