గ‌జ్జెక‌ట్టి, కాంగ్రెస్ కోసం గ‌ద్ద‌ర్ పాట‌.

Read Time: 0 minutes

ప్ర‌జాయుద్ధ‌నౌక‌, అలుపెర‌గ‌ని పోరాట‌యోధుడు… గ‌ద్ద‌ర్. ఒక 15 సంవ‌త్స‌రాల క్రితం వ‌ర‌కు గ‌ద్ద‌ర్ పాట అంటే జ‌నం ఎంత‌దూర‌మైనా వ‌చ్చేవారు. పాట‌కోసం గంట‌ల త‌ర‌బడి ఎదురుచూసేవారు. ఎన్ని పోలీసు నిర్భందాలు ఎదురైనా, పాట‌పై తుపాకి తూటాలు పేలుతున్నా… జ‌నం లెక్క చేయ‌లేదు. అంత‌టి గానం గ‌ద్ద‌ర్ ది. ఇప్పుడాయ‌న కాంగ్రెస్ కోసం మ‌ళ్లీ కాలికి గ‌జ్జెక‌ట్ట‌బోతున్నారు. రాహుల్ కోసం పాట పాడ‌నున్నారు.

నేను… కాంగ్రెస్ వ్య‌క్తిని కాదు. కానీ… ప్ర‌స్తుత ప‌రిణామాల్లో, కాంగ్రెస్ ను నిల‌బెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉందంటున్నారు గ‌ద్ద‌ర్. అందుకే… ఈనెల 15 నుండి అదిలాబాద్ అడువ‌ల నుండి త‌న పాట‌ను ప్రారంభిస్తాన‌ని, త‌న పాట‌తో… వెన‌క‌బ‌డిన వ‌ర్గాల కాంగ్రెస్ అబ్య‌ర్థుల గెలుపుకోసం ఊరూరా తిరుగుతానంటున్నారు.  నేను న‌మ్మిన సిద్ధాంతం కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ప‌నిచేశా, ఇక మీదా ప‌నిచేస్తా… ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా, ప‌ట్టించుకోను… పాట‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్తాన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇటీవ‌ల రాహుల్, సోనియాల‌ను క‌లిసిన‌ప్పుడు కూడా ఇదే మాట చెప్పాన‌ని… అందుకోసం ప‌నిచేస్తానన్నారు.

త‌న‌పై దేశ‌వ్యాప్తంగా… లెక్క‌లేన‌ని కేసులున్నాయ‌ని, ఇప్ప‌టికైతే… తెలంగాణ‌లో కేసులు కొట్టివేయ‌గా, ఏపీలో కేసుల ఉప‌సంహ‌ర‌ణ కొన‌సాగుతుంద‌న్న గ‌ద్ద‌ర్, త‌న‌కు ప్రాణ‌హ‌ని ఉంద‌ని… ర‌క్ష‌ణ కల్పించాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌తో పాటు, ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*