గ‌జ్వేల్ పోరాటం… ఓంటేరు కు డూ ఆర్ డై.

Read Time: 1 minutes

గ‌జ్వేల్ రాజ‌కీయం వేడుక్కుతోంది. కేసీఆర్ ను ఓడించే ల‌క్ష్యంతో ఉన్న కాంగ్రెస్ నేత ఓంటేరు ప్ర‌తాప్ రెడ్డి… అన్నీ అస్త్రాల‌ను వాడుతున్నాడు. గ‌త ఎన్నిక‌ల ఓట‌మి నాటి సానుభూతి ప‌వ‌నాలను న‌మ్ముకుంటూనే, కేసీఆర్ ఆరాచాకాలు సృష్టిస్తున్నాడంటూ హంగామా సృష్టిస్తున్నారు.

మండ‌లానికో ఎమ్మెల్సీ ఇంచార్జీ, వీరంద‌రికీ ఇంచార్జీ హ‌రీష్ రావు… హ‌రీష్ రావుపై కేసీఆర్. ఇది గ‌జ్వేల్ లో గెలుపు కోసం టీఆర్ఎస్ వాడుతోన్న బ‌లం. కానీ కాంగ్రెస్ నుండి ఓంటేరు ఒంటిరిగా పోరాడుతున్నారు. ఇటీవ‌లే… మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి.. ఓంటేరుకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌టంతో గ‌జ్వేలో రాజ‌కీయం మారిపోయింది. ఎంతలా అంటే, ఇంత మంది నేత‌లు ఉన్నా స‌రే…గ‌జ్వేల్ లో కాంగ్రెస్ నేత‌లంద‌రి చుట్టూ నిఘా ఉండేలా. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మ‌మ్మ‌ల్ని అడుగు కూడా బ‌య‌ట‌పెట్ట‌నీయ‌కుండా… హింసిస్తున్నారు అంటూ ఓంటేరు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకునే వారే లేరు. కాంగ్రెస్ నాయ‌కుల ఇండ్లు, బండ్లు  ఏవీ వ‌ద‌ల‌టం లేదు. దీంతో… ఫైట్ ముదురుతోంది. ఓంటేరు కూడా కేసీఆర్ పై డూ ఆర్ డై అన్న‌ట్లుగానే పోరాడుతున్నారు.

అందుకే అమ‌ర‌ణ దీక్ష అస్త్రాన్ని వ‌దిలారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న స‌మ‌యంలో జ‌రిగిన పెనుగులాట‌లో ఆయ‌న సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌టం…. గ‌జ్వేల్ లో ఓంటేరు పై మ‌రింత సానుభూతి పెంచేలా చేస్తోంది. న‌న్ను చంపేస్తారు అంటూ ఓంటేరు ఏడ్వ‌టం చూసిన ప్ర‌తి ఒక్క‌రు, ఆ వార్త విన్న గజ్వేల్ ప్ర‌జానీకం… కేసీఆర్ బాధ‌పెట్ట‌కుంటే ఎందుకు ఏడుస్తారంటూ తీర్పినిచ్చేలా చేసింది.  నామినేష‌న్లు మొద‌ల‌యిన ద‌గ్గ‌ర నుండి, గజ్వేల్ కు కూట‌మి పెద్ద‌నేత‌లు ఎవ‌రూ అటెండ్ కాలేదు. అయినా… ప్ర‌చారం ఉదృతంగ సాగుతోంది. అయితే అక్క‌డ సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడే వ‌చ్చిన అధికారులే ఉండ‌టంతో, వారంతా ఇప్పుడు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే, టీఆర్ఎస్ చేస్తోన్న అణ‌చివేత‌లు… ఓంటేరుకే మ‌రింత లాభం చేస్తాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కేసీఆర్ అందుబాటులో ఉండ‌ర‌న్న అంశం ఈసారి గ‌జ్వేల్ లో బ‌లంగా ఉంద‌ని, కేసీఆర్ ఇప్పుడు స్థానికంగా మంచి-చెడుకు నేనున్నా అంటూ వ‌చ్చే ప్ర‌తాప్ రెడ్డిని ఇలా హింసించ‌టం టీఆర్ఎస్ కే మంచిది కాదంటున్నారు స్థానిక టీఆరెఎస్ నేత‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*