గ‌జ్వేల్, మేడ్చ‌ల్ ను కాద‌ని సిద్దిపేటకు కేసీఆర్.

Read Time: 0 minutes

కేసీఆర్ ఇటీవ‌ల ఓ లీకు ఇచ్చారు. తాను గ‌జ్వేల్ తో పాటు మేడ్చ‌ల్ లో కూడా పోటీచేయ‌బోతున్నాను అని. కేసీఆర్ అనుకున్న‌ట్లే దానిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఇటు గజ్వేల్ లోనూ, అటు మేడ్చ‌ల్ లోనూ…. గ‌జ్వేల్ లో మాసారు పోతే ఎలా అనుకునేలా, ఓడిపోయే సీట్ల‌లో ఒక‌టిగా ఉన్న మేడ్చ‌ల్ లో కొంతైనా సానుకూల వాతావ‌ర‌ణం వ‌చ్చేలా ఉంటుంద‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌.

అయితే, కేసీఆర్ కు సెంటిమెంట్ల పిచ్చి ఎక్కువే. అది అంద‌రీకీ తెలుసు. దీన్ని ప‌క్క‌న పెడితే… గ‌జ్వేల్ లో ఉన్న సెంటిమెంట్  కేసీఆర్ కు త‌లనొప్పిగా మారింది. గ‌జ్వేల్ లో గెలిచిన అబ్య‌ర్థి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తుంది. అది తెలిసే … కేసీఆర్ 2014లో గ‌జ్వేల్ నుండి పోటీ చేసి గెలిచి, త‌న పార్టీని అధికారంలోకి తెచ్చి, ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడ‌దే గ‌జ్వేల్ ఆయ‌న్ను భ‌య‌పెడుతోంది. ఓవైపు కాంగ్రెస్ నేత ఓంటేరు భ‌యానికి తోడు, గ‌జ్వేల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన అబ్య‌ర్థి, వ‌రుస‌గా రెండో సారి విజ‌యం సాధించ‌లేదు. ఒక్క గీతారెడ్డి, న‌ర్సారెడ్డి మిన‌హా వ‌రుస‌గా ఎవ‌రూ పోటీయే చేయ‌లేదు. చేసినా…. గెలుపుకు అమ‌డ దూరంలోనే ఉండిపోయారు. దీంతో… కేసీఆర్ కూడా త‌న‌కు అదే ప‌రిస్థితి వ‌స్తుందా అని ఆందోళ‌న‌లో ప‌డ్డారు. అలాగ‌ని కేసీఆర్ వెళ్లిపోతే… గ‌జ్వేల్ లో కాంగ్రెస్ కు గ‌ట్టి అబ్య‌ర్థి ఎవ‌రు ఉంటార‌న్న ఆలోచ‌న చేసి, చివ‌ర‌గా గ‌జ్వేల్, మేడ్చ‌ల్ ఏదీ కాదు… తాను సిద్దిపేట‌కు పోతున్నా, నువ్వ గ‌జ్వేల్ నుండి పోటీచేసి, గెలిచి రా అని హ‌రీష్ కు చెప్పేశాడ‌ట కేసీఆర్.

ఇదీ గ‌జ్వేల్, మేడ్చ‌ల్ ను కాద‌ని, సిద్దిపేట‌కు కేసీఆర్ పోయే స్టోరీ.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*