గ‌జ్వేల్ లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు టీఆర్ఎస్ భేరం.

Read Time: 0 minutes

గ‌జ్వేల్ లో టీఆర్ఎస్ రాజ‌కీయం… మ‌నీ ప్ర‌వాహంతో ముడిప‌డిపోయిందా…?  కేసీఆర్ ఏర్పాటు చేసిన గ‌జ్వేల్ కార్య‌క‌ర్త‌ల మీటింగ్ అందుకు నాంది ప‌లికిందా….?  రాబోయే రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ఎలా ఉండ‌బోతుందో రుచి చూపించ‌బోతున్నారా… అంటే అవున‌నే అంటున్నారు అక్క‌డి స్థానిక నేత‌లు.

సీఎం స్థానంలో… సీఎం ఓడిపోతార‌న్న ప్ర‌చారమా… ఎంత‌టి అవ‌మానం, ఎంత‌టి అవ‌మానం… ఈ టాక్ ఇక బంద్ గావాల్సిందేన‌నుకున్న‌ట్లున్నారు కేసీఆర్… గ‌జ్వేల్ లో కార్య‌క‌ర్త‌ల‌తో మీటింగ్ ఏర్పాటు చేశారు. గ‌జ్వేల్ లో పార్టీ గెల‌వాల్సిన ఆవ‌శ్య‌క‌త‌, టీఆర్ఎస్ గెలుపుపై కార్య‌క‌ర్త‌ల్లో త‌న‌దైన శైలీలో ధైర్యం నూరిపోశారు గులాబీ బాస్. అయితే… స్థానికంగా ఉన్న ఇత‌ర పార్టీల నేత‌ల నుండి అందుతోన్న స‌మాచారాన్ని బ‌ట్టి… కేసీఆర్ మీటింగ్ లో టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యేందుకు ముందుకు వ‌చ్చిన నేత‌ల‌కు భారీ మొత్తం అంద‌బోతుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల‌కు చెందిన మండ‌లాధ్య‌క్షుల‌కు ఇప్ప‌టికే గాలం వేశార‌ని… పెద్ద ఆఫ‌ర్ రావ‌టంతోనే స‌ద‌రు నేత‌లు పార్టీ మారారు అన్న ప్ర‌చారం సాగుతోంది. నిత్యం కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌కున్నా, ఇక నుండి మీకు కావాల్సినవ‌న్నీ జ‌రిగేందుకు అన్నీ ఏర్పాట్లు చేసింది గులాబీ ద‌ళం. గ‌జ్వేల్ లో టీఆర్ఎస్ గెలుపుకోసం… త‌న నియోజ‌క‌వ‌ర్గానిక‌న్నా ఎక్కువ‌గా గ‌జ్వేల్ కే ప‌రిమిత‌మైన హ‌రీష్ రావునే, ఇక నుండి గజ్వేల్ బాధ్యున్ని చేసేశారు కేసీఆర్.

ఇన్నాళ్లు… త‌మ‌కు అందుబాటులో లేర‌న్న వాద‌న ప‌క్క‌న‌పెట్టండి, ఇక నుండి మీకు అన్నీ హ‌రీష్ రావే చూసుకుంటాడ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*