ఘ‌న చ‌రిత్ర నేత‌లంతా….. జ‌గ‌నాలు, ప‌వ‌నాలు చెంత‌కు.

Read Time: 1 minutes

టీడీపీ– కాంగ్రెస్ ల క‌ల‌యిక‌… ఎపీలో రాజ‌కీయం మార్పును స్ప‌ష్టంగా చూపిస్తోంది. క‌ల‌లో కూడా ఊహించ‌ని ప‌రిణామం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురిచేసినా… ఎదో ఒక వంక దొర‌కాలి కాబ‌ట్టి, ఎవ‌రి రాజ‌కీయం వారు చూసుకొని… పార్టీ మారిపోతున్నారు.

ప్ర‌తి చోట‌… నేత‌లు మారిన, క్యాడ‌ర్ పార్టీని వెంట‌బెట్టుకొని ఉంటుంది. కానీ… ఏపీ కాంగ్రెస్ లో అలా లేదు. ప్ర‌స్తుతానికి అయితే… ఏపీలో కాంగ్రెస్ కు నేతలున్నారు. వారంతా చిన్న చిత‌క నేత‌లు కూడా కాదు. 2014 కు ముందు రాష్ట్ర రాజ‌కీయాల్లో క్రీయాశీక‌ల నేతలు. కానీ ఇప్పుడు వారు కూడా త‌మ‌దారి తాము చూసుకుంటున్నారు. ఇక పార్టీ బ్ర‌తికేది లేదు, మ‌నం మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది లేద‌నుకున్న‌ట్లున్నారు… అందుకే ఒక‌రి వెన‌క ఒక‌రు… టీడీపీ-కాంగ్రెస్ క‌ల‌యిక సాకుతో జంప్ చేస్తున్నారు.

నిజానికి… కాంగ్రెస్ కూడా, చంద్ర‌బాబుతో జ‌త‌క‌ట్ట‌డం వ‌ల్ల కేంద్రంతో పాటు, రాష్ట్రంలో ఎంతోకొంత మేలు జ‌ర‌గ‌క‌పోదా అనుకొని ఉంటుంది. కేంద్రం సంగ‌తి అటుంచితే, రాష్ట్రంలో మాత్రం… ఖ‌చ్చితంగా మేలు చేయ‌దు. ఎందుకంటే… కాంగ్రెస్ పార్టీకి మ‌ళ్లీ ఊపిరిపోయ‌డానికి టీడీపీ సిద్దంగా లేదు. ప్ర‌త్య‌ర్ధిని… త‌యారు చేసుకోవ‌టం ఏ పార్టీకి ఇష్టం ఉండ‌దు. ఉంటే గింటే… తోక పార్టీలాగా ఉంచుకుంటారు. కానీ… కాంగ్రెస్ లోని పెద్ద నాయ‌కులు అలా తోక‌పార్టీలో ఉండేందుకు రెడీగా లేరు. అందుకే, రానున్న రోజుల్లో… ఇబ్బందిప‌డే క‌న్నా, ఎన్నిక‌ల‌కు ముందే పార్టీ మారితే… గౌర‌వంతో పాటు, ఎదో ప‌ద‌వి ద‌క్కుతుంది, మ‌ళ్లీ మ‌న‌కు మంచి రోజులు వ‌స్తాయ‌ని ఆశ‌తోనే ప‌క్క పార్టీల‌వైపు చూస్తున్నారు. అందుకే వ‌ట్టి వ‌సంత్ కుమార్, గిరిజ‌న నేత‌ బాల‌రాజు, సి.రామ‌చంద్ర‌య్య లాంటి నేత‌లు పార్టీ మారుతున్నారు. కొంద‌రు జ‌గ‌న్ వైపు, అక్క‌డ అవ‌కాశం లేని వారు… జ‌న‌సేన వైపు తొంగి చూస్తున్నారు. ఆపార్టీలు కూడా… గెలుపే ల‌క్ష్యంగా ఉంటాయి కాబట్టి, వెంట‌నే ఒకే చెప్ప‌టం, పార్టీలో చేర్చుకోవ‌టం జ‌రిగిపోతున్నాయి.

సో… మాజీలంతా ప‌వ‌నాలు,జ‌గ‌నాల చేంత‌కు చేరుతుండగా, చంద్ర‌బాబు ఆశించిన‌…. ఏపీలో కాంగ్రెస్ తోక పార్టీ హోదా త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని విమ‌ర్శిస్తున్నారు పార్టీ  మారే నేత‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*