చందులాల్, మ‌ధుసుధ‌నాచారీ ల హత్య‌కు మావోల రెక్కీ.

Read Time: 0 minutes

ఎన్నిక‌ల ప్ర‌చారం ఉదృత‌మ‌వుతోన్న వేళ‌… టీఆర్ఎస్ నేత‌ల‌ను షాక్ గురిచేసే వార్త ఇది. ఎజెన్సీ ప్రాంతాల్లో అధికారం చెలాయిస్తున్న నేత‌ల‌ను… ఏపీలో అర‌కు ఎమ్మెల్యే మాదిరిగా ప్ర‌జా కోర్టులో హ‌త‌మార్చేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వ‌హించారు.

తెలంగాణ‌లోకి మావోయిస్టు యాక్ష‌న్ టీమ్స్ ఇప్ప‌టికే రంగంలోకి దిగిన‌ట్లు ఇంట‌లిజెన్స్ వ‌ర్గాలు అంచానా వేసి, అధికారుల‌ను… నేత‌ల‌ను అల‌ర్ట్ చేశాయి. ఆప‌ద్ద‌ర్మ మంత్రిగా ఉన్న చందులాల్ తో పాటు, మాజీ స్పీక‌ర్ భూపాల‌ప‌ల్లి నుండి ప్రాతినిద్యం వ‌హించిన ముధుసుద‌నాచారీ హ‌త్య‌కు రెక్కీ నిర్వ‌హించారు. ఇప్ప‌టికే వ్యూహ‌ర‌చ‌న చేశార‌ని… జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స‌మాచారం అందింది. ఇక‌, తాడ్వాయి టీఆర్ఎస్ మండ‌ల పార్టీ అద్య‌క్షుడు శ్రీ‌నివాస్ రెడ్డిని కూడా హ‌త్య చేసేందుకు మావోయిస్టులు రెక్కీ జ‌రిగింద‌ని స్పెష‌ల్ బ్రాంచ్ పేర్కొంది. దీంతో… త్వ‌ర‌గా చందూలాల్ త‌న ప్ర‌చారాన్ని ముగించుకున్నారు.

ఇక‌, ఓవ్య‌క్తి తడ్వాయి మండ‌లంలోని ఓ గ్రామంలో… త‌న పోలంలో 30మంది మావోయిస్టుల‌కు ఆశ్ర‌మిచ్చిన‌ట్లు పోలీసులు ప‌సిగట్టి, ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నిస్తున్నారు. అరకు ఎమ్మెల్యే త‌ర‌హలోనే… ఇద్ద‌రు నేత‌ల‌తో ప్రజాకోర్టు నిర్వ‌హించి, హ‌త‌మార్చేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో… ఈ ఇద్ద‌రు నేత‌ల‌కే కాకుండా, ఎజెన్సీ నేత‌లంద‌రికి భ‌ద్ర‌త పెంచ‌టంతో పాటు, పోలీసులు కూడా గ‌స్తీ పెంచారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*