చార్మిని వ‌ద‌లేక‌పోతున్న స్టార్ డైరెక్ట‌ర్ పూరి.

Read Time: 0 minutes

కొంత‌కాలంగా… మంచి హిట్స్ లేకుండా, గ‌త‌మెంతో ఘ‌నం.. వ‌ర్త‌మానం శూన్యం అన్న‌ట్లు త‌యారైన స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మ‌రో మాంచి క‌థ‌తో రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. ఆ మ‌ద్య కోడుకుతో సినిమా పెట్టి… ఉన్న‌దంత పొగుట్టుకున్న పూరి, ఈసారి ఎలాగైన హిట్ కొట్టి, మంచి క‌మ్ బ్యాంక్ ఇవ్వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకోసం… మ‌రోసారి చార్మినే న‌మ్ముకున్నారు.

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తో జ‌త‌కట్ట‌బోతున్నారు పూరి. కొంత‌కాలంగా వీరిద్ద‌రి కాంబినేష‌న‌ల్ లో సినిమా ఉంటుంద‌ని అంతా అనుకున్నా… ఇప్ప‌టి వ‌ర‌కు అది నెర‌వేరలేదు. అయితే, తాజాగా పూరి చెప్పిన క‌థ‌కు రామ్ గ్రీన్ స్నిగ‌ల్ ఇవ్వ‌టంతో…. త్వ‌ర‌లోనే ఈ క‌థ సెట్ పైకి ఎక్కించేందుకు కస‌రత్తులు ముమ్మ‌రం చేస్తున్నారు పూరీ. ఓ డిఫ‌రెంట్ స్టైల్లో… గ‌తంలో రామ్ సినిమాల‌కు పూర్తిభిన్నంగా… ఎనర్జీటిక్ గా మూవీ ఉండ‌బోతుందంటోంది సినిమా టీం.  ఈసినిమా ను స్ర‌వంతి ర‌వికిశోర్, పూరి జ‌గ‌న్నాథ్ క‌లిసి నిర్మించ‌బోతున్నారు. స్ర‌వంతి  ర‌వికిశోర్ బ్యాన‌ర్ అంటే… రామ్ సొంత బ్యాన‌ర్. ఇక ఈసినిమాకు మ‌రో ప్రొడ్యూస‌ర్ కూడా తోడ‌వ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ గా, మంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, మాంచి ఐట‌మ్ గీతాల‌తో… అందాలు ఆరబోసిన హీరోయిన్ చార్మీ కూడా ఈసినిమాలో పెట్టుబ‌డి పెడుతుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం… చార్మి  మ్యానేజ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌నుంది అంటున్నాయి పూరిజ‌గన్నాథ్ టీం వ‌ర్గాలు. ఇటీవ‌లే విడుద‌ల‌యిన రామ్ సినిమా హ‌లోగురు ప్రేమ కోసమే… బాగానే ఉన్నా, బాక్సాఫీస్ వ‌ద్ద బొల్తా కొట్టేసింది. అయితే, ఎంతో ఘ‌న చ‌రిత్ర ఉన్న పూరి… క‌లెక్ష‌న్ల ప‌రంగా వీక్ గా ఉండే… రామ్ కాంబినేష‌న్లో కొత్త సినిమా ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అయితుందో చూడాలి. ఇక‌… కొత్త రోల్ లో చార్మింగ్ చార్మి ఎలా స‌రిపోతుందో అన్న‌ది కొత్త ట్విస్ట్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*