చెయ్యి గుర్తుకే జైకొడుతున్న ఉద్య‌మ నేత‌లు.

Read Time: 1 minutes

ఎన్నిక‌ల వేళ‌… కాంగ్రెస్ కు శుభ‌శ‌కునాలే ఎదుర‌వుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు అన్నీ కూట‌మి కాగా, ఇప్పుడు తెలంగాణ‌లో ఉద్య‌మ నేత‌లంతా… ఇప్పుడు చెయ్యేత్తి కాంగ్రెస్ కు జైకొడుతున్నారు. ఇన్నాళ్లు… తెలంగాణ‌లో ఉన్న ప్ర‌జా, మేధావులు కాంగ్రెస్ కు మ‌ద్ద‌తివ్వ‌టం ప‌ట్ల కాంగ్రెస్ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

తెలంగాణ ఉద్య‌మంలో ముందువ‌రుస‌లో ఉన్న వారిలో… గ‌ద్ద‌ర్, విమ‌ల‌క్క‌, మంద‌కృష్ణ‌లాంటి నేత‌ల‌తో పాటు, బీసీసంఘాల ప్ర‌తినిధిగా ఉన్న ఆర్.కృష్ణ‌య్య ఏకంగా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌కంగా ఉన్న టీజెఎస్ నేత కోదండరాం కూడా కాంగ్రెస్ కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌టం…. చ‌ర్చ‌నీయాంశం అవుతోందంటున్నారు విశ్లేష‌కులు. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ తో స‌మానంగా, కేసీఆర్ తో క‌లిసి న‌డిచిన నేత కోదండ‌రాం.

ఇక‌, ప్ర‌జా ఉద్య‌మాల్లో, సామాజిక ఉద్య‌మాల్లో… మందకృష్ణ ఒక‌రు. టీఆర్ఎస్ పై ముందునుండి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో పోరాటం చేస్తున్న మంద‌కృష్ణ, ఉద్య‌మ స‌మ‌యంలో… పూర్తిగా కేసీఆర్ తో న‌డిచారు. కేసీఆర్ దీక్ష విర‌మ‌ణ స‌మ‌యంలో…. ప‌క్క‌నే ఉన్న నేత మంద‌కృష్ణ‌.

ప్రజా యుద్ద నౌకగా పేరు గాంచిన  గద్దర్ కూడ కేసీఆర్ పాలనపై అనేక విమర్శలు చేస్తూ, తెలంగాణ లో కేసీఆర్ పాల‌నకు చ‌మ‌ర‌గీతం పాడాలంటూ…. పిలుపునిస్తున్నారు. గ‌ద్ద‌ర్ ఇప్ప‌టికే… కేసీఆర్ కు వ్య‌తిరేకంగ గ‌ల‌మెత్తుతూ, సోనియా– రాహుల్ గాంధీల‌తో భేటీ అయ్యారు. గ‌ద్ద‌ర్ కొడుకు ఇప్ప‌టికే కాంగ్రెస్ లో ఉండ‌గా, తాను కూడా కాంగ్రెస్ నేత‌ల కోసం ప్ర‌చారం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

మ‌రో ప్ర‌జా గాయ‌కురాలు… బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం తాప‌త్ర‌య‌ప‌డే అరుణోద‌య స‌మాఖ్య‌ విమలక్క, స‌హ ఇత‌ర ప్ర‌జా నేత‌లంతా… కేసీఆర్ కు వ్య‌తిరేకంగా గ‌ల‌మెత్తుతూ, కాంగ్రెస్ కు అండ‌గా ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇది చాలా పెద్ద అంశ‌మ‌ని, ఇలా ప్ర‌జా సంఘాలు, ప్ర‌జ‌ల కోసం పాటుప‌డుతారు అని పేరున్న నేత‌లంతా… కాంగ్రెస్ కు జై కొడుతున్నారంటే…. ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావితం చూపిస్తుంద‌ని అంచానా వేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*