టాక్సీవాలా డైరెక్ట‌ర్ ను భ‌య‌పెట్టిన న‌యనాతార‌

Read Time: 0 minutes

టాక్సీవాలా సినిమా…. ఇప్పుడు తెలుగులో మంచి హీట్ టాక్ తో, సూప‌ర్ డూప‌ర్ హీట్ వైపు ప‌రుగెడుతోంది. అర్జున్ రెడ్డి ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను… కొత్త ర‌కం క‌థ‌తో ప్రేక్ష‌కుల‌కు ముందుకు తెచ్చిన సినిమా ఇది. అయితే… ఈ సినిమా డైరెక్టర్ ఓ నిజాన్ని చాలా రోజుల త‌ర్వాత బ‌య‌ట‌పెట్టాడు.

టాక్సీవాలా డైరెక్ట‌ర్ రాహుల్  కు సినిమా రిలీజ్ త‌ర్వాత ఎంతో పేరు వ‌చ్చింది. పాత క‌థే అయినా… కొత్త‌గా థింక్ చేసి, ఎక్క‌డా వినోదం త‌గ్గ‌కుండా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశారు. నోటా సినిమాతో తొలి ఫెయిల్యూర్ ను రుచి చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌ళ్లీ హిట్ తెచ్చి పెట్టిన ద‌ర్శ‌కుడు.

అయితే… ఈ ద‌ర్శ‌కున్ని అందాల తార‌, సౌత్ ఇండియ‌న్ బ్యూటీ… సీనీయ‌ర్ న‌టి న‌య‌నాతార భ‌య‌పెట్టింద‌ట‌. భ‌య‌పెట్ట‌డం అంటే… బెదిరించ‌ట‌మో ఇంకోటో కాదు. న‌య‌నాతార ఆ మ‌ద్య ఓ సినిమా చేసింది. ఆ సినిమా పేరు డోరా. ఆ సినిమా కూడా సేమ్… కారులో దెయ్యం క‌థే. అప్పుడే…. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో టాక్సీవాలా షూటింగ్ న‌డుస్తోంద‌ట‌. దాంతో… డోరా సినిమా రీలీజ్ కాగానే, టాక్సీవాలా కూడా రీలీజ్ అయితే… సినిమా ప్లాఫ్ అవుతుంద‌ని బ‌య‌ప‌డ్డార‌ట రాహుల్. దీంతో, నిర్మాత‌కు అస‌లు విష‌యం చెప్పి షూటింగ్ ను  మ‌ద్య‌లోనే ఆపేశార‌ట‌. డోరా సినిమా నుండి జ‌నం బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు షూటింగ్ ఆపించేసి, తాజాగా ఆ సినిమా షూటింగ్ ను పూర్తిచేసి…రీలీజ్ చేశార‌ట‌.  నా సినిమా కాన్సెప్ట్ ఆ సినిమాకు దగ్గరగా ఉందనిపించింది. దీంతో షూటింగ్ కొద్దిరోజులు పాటు వాయిదా వేసేశాం. డోరా సినిమా రిలీజ్ అయిన వెంటనే తొలి షోకి వెళ్లి సినిమా చూశాను. మొదట నా సినిమాకు కాస్త దగ్గరగా ఉందనిపించినా.. ఇంటర్వెల్ తరువాత అసలు సంబంధం లేదని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటూ దర్శకుడు రాహుల్ ఓ ఇంట‌ర్వ్యూలో  చెప్పుకొచ్చారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*