టీఆర్ఎస్ కు ఎంఐఎం ఝ‌ల‌క్, అక్క‌డ కూట‌మికే మ‌ద్ద‌తు.

Read Time: 1 minutes

కొంత‌కాలంగా… పాలు-నీళ్ల‌లా కలిసిపోయిన టీఆర్ఎస్–మ‌జ్లిస్ పార్టీలు, అనూహ్యంగా మ‌జ్లిస్ ఇచ్చిన షాక్ తో టీఆర్ఎస్ ఖంగుతింది.  ఇటీవ‌ల అక్బ‌ర్, అస‌ద్ వాఖ్య‌లు చేసిన‌ట్లు డిసెంబ‌ర్ 11 త‌ర్వాత చుక్క‌లు చూపిస్తామ‌ని చెప్పినా… క‌నీసం పోలింగ్ తేదీ కూడా రాక‌ముందే మ‌జ్లిస్ షాక్ ఇచ్చింది.

మ‌జ్లిస్ ను ద‌గ్గ‌ర‌కు తీస్తే… పాముకు పాలు పోసి పెంచిన‌ట్లేన‌ని గ‌తంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ కీల‌క నేత‌లు క్లోజ్ స‌ర్కిళ్ల‌లో మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ, గ్రేట‌ర్ లో త‌మ పార్టీ డ‌మ్మీ అబ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి మ‌రీ, ఎంఐఎంను కాపాడుకుంటుంది. ఈ ఎన్నిక‌ల్లో స‌రైన మెజారిటీ రాక‌పోతే… ఎంఐఎం త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని టీఆర్ఎస్ భావిస్తున్న త‌రుణంలో, త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌కుంటే… ఎలా ప్లేటు ఫిరాయిస్తుందో చేసి చూపించింది.

అదిలాబాద్ జిల్లా ముదోల్ నియోజ‌వ‌ర్గంలో ఎంఐఎంకు గట్టి ప‌ట్టుంది. అక్క‌డ బైంసా ప్రాంతంలో ఎంఐఎం చెప్పిన అబ్య‌ర్థికే గంప‌గుత్త‌గా ఓట్లు ప‌డుతాయి. అయితే… టీఆర్ఎస్ తో పొత్తుతో  ఉన్న ఎంఐఎం, ఈసారి టీఆరెఎస్ కు మ‌ద్దితిస్తుంద‌ని అంతా భావించినా, పోలింగ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న సంద‌ర్భంలో…. అనూహ్యంగా ఆ పార్టీ కాంగ్రెస్ అబ్య‌ర్థి రామారావు ప‌టేల్ కు మ‌ద్ద‌తిచ్చారు. దీంతో… ఆయ‌న గెలుపుకు మ‌రింత చేరువైన‌ట్ల‌యింది. అక్కడ ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేగా ఉండి, ప్ర‌స్తుతం టీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి ముస్లీంల‌కు చేసిందేమీ లేద‌ని, ఆయ‌న మ‌ళ్లీ గెలిచిన త‌మ‌కేమీ చేయ‌డ‌ని ఆ పార్టీ జిల్లా అద్య‌క్షుడు స్ప‌ష్టం చేశారు. రామారావు ప‌టేల్ ను గెలిపించుకొని, ప్ర‌జ‌ల‌కు మంచి చేద్దామంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ మ‌ద్ద‌తు కేవ‌లం ముధోల్ వ‌రకేన‌ని, ఇక్క‌డున్న  స్థితిమేర‌కే తాము ఈ నిర్ణ‌యం తీసుకుంటే, పార్టీ కూడా మాకు మ‌ద్ద‌తిచ్చింద‌ని తెలిపారు.

ఇప్పుడే ఇలా ఉంటే, టీఆర్ఎస్ కు స‌రైన మెజారిటీ రాకుండా… ఎంఐఎం మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మైతే, ఆ పార్టీ వ్య‌వ‌హ‌రం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*