టీఆర్ఎస్ కు వ‌ల‌స‌ల ఎదురుదెబ్బ‌లు, క్యూలో మ‌రికొంద‌రు ఎంపీ, ఎమ్మెల్సీలు.

Read Time: 1 minutes

పోలింగ్ తేదీ ముంచుకొస్త‌న్న వేళ‌, ప్రచారంపై దృష్టిపెట్టిన కేసీఆర్ కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే పార్టీ మారిన ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌కు తోడుగా…  చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ కు జైకొట్ట‌గా, అతి త్వ‌ర‌లో మ‌రో ఎంపీ, ఇద్ద‌రు ఎమ్మెల్సీలు పార్టీ మార‌బోతున్నారు.

ఎన్నిక‌ల‌కు రెండు వారాలు ఎంతో కీల‌కం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తుకు వెళ్లింది. వారికి ఇది నిజంగా అగ్ని ప‌రీక్షే. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో… గ‌తంలో పార్టీ పెద్ద‌లు వ్య‌వ‌హ‌రించిన తీరు, అసంతృప్త నేత‌లు ఒక్కోక్క‌రు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా ఎంపీ కొండాతోపాటు, మ‌రో ఎంపీ, ఎమ్మెల్సీ యాద‌వ‌రెడ్డితో పాటు మ‌రో ఎమ్మెల్సీ ఈ నెల 23 జ‌రిగే సోనియా-రాహుల్ గాంధీల ప్ర‌చార స‌భ‌ల్లో పార్టీలో చేర‌బోతున్నారు.

కేటీఆర్… స్వ‌యంగా ఇంటికి వ‌చ్చి, ఫోన్ లో రెండుసార్లు ఫోన్ ల బుజ్జ‌గించినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక కొండా తో జరిగిన సంభాష‌ణ‌లో కేటీఆర్ కాస్త ఘాటుగా మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. కాబోయేది నేనే సీఎం. మ‌రో 15 సంవ‌త్స‌రాలు మ‌న‌దే ప్ర‌భుత్వం. కాబ‌ట్టి మీరు పార్టీ నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌టమే మీకు మంచిదంటూ చెప్ప‌టం ప‌ట్ల ఎంపీ కొండా మ‌రింత ఆగ్ర‌హానికి గురిచేసింద‌ని తెలుస్తోంది. న‌న్నే ఇంత బెదిరిస్తున్న‌ట్లు మాట్లాడితే… మాములు లీడ‌ర్ ప‌రిస్థితి ఎలా ఉంటుందని ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద ఆవేధ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు ఆయ‌న వ‌ర్గీయులంటున్నారు. ఇక‌… రాబోయే రోజుల్లో ఇలాంటి చేరిక‌లు మ‌రిన్ని ఉండ‌బోతున్నాయంటున్నారు కాంగ్రెస్ నేత‌లు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*