టీఆర్ఎస్ నేత హ‌రీష్ రావు అరెస్ట్…?

Read Time: 0 minutes

టీఆర్ఎస్ ట్ర‌బుల్ షూట‌ర్, కేసీఆర్ మేన‌ల్లుడు… హ‌రీష్ రావుకు జైలు జీవితం త‌ప్పాదా… అంటే త‌ప్ప‌దేమో అన్న జ‌వాబే వ‌స్తోంది.  అయితే హ‌రీష్ అరెస్ట్ పై ఎవరేమైనా కుట్ర చేశారా అంటే అదీ లేదు. ఆయ‌న చేతులారా చేసుకుందే ఇప్పుడు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంది.

మ‌హ‌కూట‌మితో పోటీ ప‌డ‌లేక‌పోతున్నామ‌ని, ఇక తొక్కిపెట్టిన హ‌రీష్ రావుకు మ‌ళ్లీ ఫ్రీ హ్యండ్ ఇవ్వాల్సిందేన‌ని డిసైడైన కేసీఆర్… మ‌ళ్లీ హ‌రీష్ కు పెద్ద‌పీట వేయ‌టం అంద‌రికీ తెలిసిందే. అయితే… ఈ ఊపులో కేసీఆర్ ను మెప్పించేందుకు తొంద‌ర‌ప‌డ్డ హ‌రీష్ రావు, నోటికి ప‌నిచెప్పారు… గ‌జ్వేల్ స‌హ ఇత‌ర ప్రాంతాల్లో కుల సంఘాల మీటింగ్ లు పెట్టి అటునుండి న‌రుక్కొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి హ‌రీష్ కు కుల సంఘాల‌తో, వివిధ మ‌త సంఘాల‌తో… రాజ‌కీయం చేయ‌టం, గెల‌వ‌టం కొత్తేమీ కాదు. గ‌తంలో క‌డియం ను ఓడించేందుక‌… ఓడిపోతాడ‌నుకున్న టీఆర్ఎస్ అబ్య‌ర్థిని రాజ‌య్య‌ను గెలిపించేందుకు హ‌రీష్ ఇదే ప్లాన్ వ‌ర్క‌వుట్ చేశాడు. కాక‌పోతే… అప్ప‌ట్లో సెంటిమెంట్ కార‌ణంగా ఎవ‌రూ ఫిర్యాధు చేయ‌లేదు. కానీ ఈసారి హ‌రీష్ రావు… చేష్ట‌ల‌ను, మాట‌ల‌ను ఈసీ దృష్టికి తీసుక‌రావ‌టంతో, ఈసీ సీరీయ‌స్ అయింది.

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి… హ‌రీష్ పై వ‌చ్చిన ఫిర్యాదును పంప‌గా, కేంద్రం ఎన్నిక‌ల సంఘం సీరీయ‌స్ గా రియాక్ట్ అయింది. వెంట‌నే హ‌రీష్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిని ఆదేశించింది. ప్ర‌జా ప్రాతినిద్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 125 ప్ర‌కారం… హ‌రీష్ రావుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. సెక్ష‌న్ 125 కింద‌… ఎన్నిక‌ల స‌మ‌యంలో… రెండు వ‌ర్గాల మ‌ద్య అంటే… రెండు కులాల మ‌ద్య గానీ, రెండు మ‌తాల మ‌ద్య గానీ చిచ్చుపెడితే చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం… హ‌రీష్ రావుకు మూడేండ్ల జైలు గానీ, భారీ జ‌రిమానా గానీ… లేదా రెండు విధించే అవ‌కాశం ఉంది.

అయితే… తాము ఆరోపించింది నిజ‌మ‌నే తేలింద‌ని, ప్ర‌జ‌ల మ‌ద్య వైష‌మ్యాలు రేపుతూ… రాజ‌కీయంగా ల‌బ్ధిపొంద‌టం టీఆర్ఎస్ పార్టీ నైజం అనేది మరోసారి నిరూపిత‌మైంద‌ని ప్ర‌జా కూట‌మి ఆరోపిస్తోంది. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, హ‌రీష్ ను జైలుకు పంపాలంటూ కోరుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*