టీఆర్ఎస్ భ‌వ‌న్ కూ తాకిన ఆందోళ‌న‌లు.

Read Time: 0 minutes

ఇన్నాళ్లు… కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో టికెట్ ఆశావాహులు ధ‌ర్నా చేస్తే… ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ నాయ‌కుల‌కు నిజంగా ఇది రుచించ‌ని వార్తే. కూట‌మిలో ఎలా కొట్టుకుంటున్నారో చూడండి, కాంగ్రెస్ ప‌రిస్థితి చూడండి అంటూ గొప్ప‌ల‌కు పోయి విమ‌ర్శ‌లు చేసిన టీఆరెఎస్ పార్టీ ఆఫీసుకూ నిర‌స‌న‌లు తాకాయి. ఖైరాతాబాద్ టికెట్ మా నేత‌కే ఇవ్వాలంటూ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ముందు ద‌ర్నాకు దిగారు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు.

మన్నెగోవ‌ర్ధ‌న్ రెడ్డి… 2014లో టీఆర్ఎస్ నుండి  ఖైర‌తాబాద్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఇంచార్జీగా ఉన్నారు. కానీ కేసీఆర్ ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించి, ఆ సీటు పెండింగ్ లో పెట్టారు. అక్క‌డి నుండే పీజెఆర్ కూతురుతో పాటు, ఇటీవ‌లే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ కూడా ఆ సీటు పై ఆశ‌లు పెట్టుకున్నారు. గత ఎన్నిక‌ల్లో పీజెఆర్ కూత‌రు విజ‌యారెడ్డి రెండో స్థానంలో నిల‌వ‌గా… త‌క్కువ మెజారిటీతో ఓడిపోయారు. కానీ ఈసారి టికెట్ దానం నాగేందర్ కు ఇవ్వ‌బోతున్నార‌న్న స‌మాచారంతో… ప్యార‌ష్యూట్ నేత‌ల‌కు మీరేలా ఇస్తారు, కాంగ్రెస్ ను విమ‌ర్శించి… మీరు అదే ప‌ని చేస్తారా అంటూ మ‌న్నె గోవ‌ర్ద‌న్ మనుషులు తెలంగాణ భ‌వ‌న్ ను ముట్ట‌డించారు. ధ‌ర్నా చేశారు. దీంతో ఇన్నాళ్లుగా అంత‌ర్గ‌తంగా అసమ్మ‌తి వాదుల‌ను బుజ్జ‌గిస్తూ వ‌స్తోన్న టీఆర్ఎస్ నాయ‌క‌త్వం షాక్ కు గురైంది. ఇటు దానం నాగేంద‌ర్ కు సీటు ఇస్తే.. విజయారెడ్డి కూడా రెబ‌ల్ గా పోటీచేసే అవ‌కాశం ఉంది. ఇక్క‌డే కాదు… ఇన్నాళ్లు కాస్త చ‌ప్పుడు చేయ‌కుండా ఉన్న మ‌రికొంత మంది అస‌మ్మ‌తి వాదులు కూడా… తెలంగాణ బ‌వ‌న్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగే అవ‌కాశం ఉంద‌ని, ఇది ఇంత‌టితో ఆగే ప‌ని కాదంటున్నాయి ఇంట‌లిజెన్స్ వ‌ర్గాలు. గాంధీ బ‌వ‌న్ వ‌ద్ద ఉన్న ప‌రిస్థితే రానురాను రిపీట్ అవ్వ‌బోతుంద‌ని స‌ర్కార్ ను హెచ్చరించిన‌ట్లు స‌మాచారం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*