టీజెఎస్ కు ఝ‌ల‌కిచ్చిన కాంగ్రెస్.

Read Time: 1 minutes

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూటమిలోని పార్టీలకు మరో ఝలక్ ఇచ్చింది. 94 స్థానాల్లో పోటి చేస్తామని  ప్రకటించిన కాంగ్రెస్ 99 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేసింది. ఈ విషయం పై కూటమి పార్టీలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 94 స్థానాల్లో పోటి చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో అభ్యర్దులకు బిఫారాలు అందజేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు కావడంతో సోమవారం ఉదయం 5 గురు అభ్యర్ధులకు కాంగ్రెస్ బిఫాంలు అందజేసింది. కాంగ్రెస్ పార్టీ  బి ఫాంలు అందజేసిన 5 స్థానాలివే

హూజూరాబాద్ – కౌశిక్ రెడ్డి
దుబ్బాక- నాగేశ్వర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం- మల్ రెడ్డి రంగారెడ్డి
పటాన్ చెర్వు- శ్రీనివాస్ గౌడ్
వరంగల్ ఈస్ట్ – గాయత్రి రవి

వీరందరికి సోమవారం ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి బిఫాంలు అందజేసినట్టు తెలుస్తోంది. టిడిపికి ముందుగా అనుకన్నట్టు 14 సీట్లు కాకుండా 13 సీట్లే కేటాయించింది. టిడిపికి ఇవ్వడానికి వీలు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీ ఫారాలు అందజేసింది. ఇబ్రహీంపట్నం సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. అక్కడి నుంచి సామ రంగారెడ్డికి టికెట్ కేటాయించారు. రంగారెడ్డి ఎల్ బీ నగర్ సీటు కోరినా అది సుధీర్ రెడ్డికి కేటాయించడంతో సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం కేటాయించారు.

ఇక్కడ పోటి చేయడం ఇష్టం లేదని సామరంగారెడ్డి చంద్రబాబును కలిసి విషయం చెప్పారు. మల్ రెడ్డి రంగారెడ్డి కూడా సామ రంగారెడ్డికి మద్దతిస్తానని ప్రకటించారు. అప్పుడు సామ రంగారెడ్డి పోటి చేస్తానని ప్రకటించారు. అనూహ్యంగా మల్ రెడ్డి రంగారెడ్డి తానే కాంగ్రెస్ నుంచి పోటి చేస్తానని బీ ఫాం వస్తుందని కూడా ప్రకటించాడు. ఆయన ప్రకటించినట్లుగానే కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డికి బీ ఫాం ఇచ్చింది.

పఠాన్ చెర్వు కూడా టిడిపి నుంచి నందీశ్వర్ గౌడ్ కు కేటాయిస్తారని అంతా అనుకున్నారు. టిడిపి కూడా ప్రకటించే ఒక్క స్థానం అదేనని చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ కు టికెటిచ్చారు. వరంగల్ ఈస్ట్ లో టిజెఎస్ తన అభ్యర్ధిని ప్రకటించింది. అక్కడ కూడా గాయత్రి రవికి కాంగ్రెస్ టికెట్ కేటాయించారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*