టీడీపీ ఆర్థిక మూలాలే టార్గెట్… గా

Read Time: 1 minutes

ఇటు తెలంగాణ ఎన్నికల్లో కూట‌మి త‌రుపున‌, అటు దేశ రాజ‌కీయాల్లో మ‌రింత క్రీయాశీల‌కంగా ఉండేందుకు టీడీపీ చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌పై న‌రేంద్ర‌మోడీ దృష్టిపెట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ఆయ‌న అనుచ‌రులు అనుమానిస్తున్న‌ట్లుగానే… ఈడీ రంగంలోకి దిగింది. చంద్ర‌బాబు కీల‌క అనుచ‌రుల కంపెనీల టార్గెట్ గా సోదాలు, సీజ్ లు కొన‌సాగుతూ ఉన్నాయి.

సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్… ఇలా చెప్పుకుంటూ పోతే, ఓ అర‌డ‌జ‌ను కీల‌క అనుచ‌రులు, మ‌రో డ‌జ‌ను మంది నేత‌లు టీడీపీ, చంద్ర‌బాబు ఆర్థిక మూలాలు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే… బీజేపీతో డీకొడుతున్న చంద్ర‌బాబు ఆర్థిక మూలాలే టార్గెట్ గా కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే ఎంపీ సీఎం ర‌మేష్ పేరు సిబిఐ ముడుపుల వ్య‌వ‌హ‌రంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆయ‌న కొంత సైలెంట్ అయ్యారు. ఆ త‌ర్వాత ఈడీ కేసులు, దాడులు ఉంటాయ‌న్న స‌మాచారంతో… ఈడీ,సిబిఐలాంటి సంస్థ‌లు ఏపీలో అడుగుపెట్ట‌కుండా చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ వేసినా, ఆయ‌న ఆర్థిక మూలాల ఆఫీసుల‌న్నీ ఎక్కువ‌గా హైద‌రాబాద్ లోనే ఉండ‌టంతో… ఇక్క‌డ సోదాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే సుజ‌నా చౌద‌రిని టార్గెట్ చేస్తూ, 5700కోట్ల ఎగ‌వేత చేసిన‌ట్లు లెక్క తేల్చాయి. మ‌రిన్నీ రోజులు సోదాలు కొన‌సాగే అవ‌కాశం కూడా ఉంది.

అయితే, తెలంగాణ‌లో కూట‌మి కోసం మొత్తం డ‌బ్బు చంద్ర‌బాబే సప్లై చేస్తున్నార‌ని… టీఆర్ఎస్ ఆరోపిస్తున్న త‌రుణంలో, ఎన్నిక‌ల‌కు మ‌రో ప‌ది రోజుల ముందు ఈ ఈడీ దాడుల‌తో టీడీపీ వ‌ర్గాలు క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి. కేసీఆర్– మోడీల మ‌ద్య అవ‌గాహ‌న మ‌రోసారి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, తెలంగాణ‌లో మ‌హ‌కూట‌మి బ‌ల‌ప‌డుతోంద‌న్న స‌మాచారంతోనే… ఆర్థిక ఇబ్బందులు సృష్టించేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌గా, కూట‌మి నేత‌లు, టీడీపీ కీల‌క నేత‌లు అంచనా వేస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*