టీ.టీడీపీ కీల‌క నేత‌ల‌కే నో టికెట్– స‌ముదాయించిన చంద్ర‌బాబు.

Read Time: 0 minutes

తెలంగాణలో మ‌హ‌కూట‌మి పొత్తుల‌తో… ఏ సీటు నుండి చూసిన ఆశావాహులు ఎక్కువైపోయారు. కూట‌మి ప‌క్షాల‌న్నీ క‌లిస్తే… ఖ‌చ్చితంగా గెలిచే అవ‌కాశం ఉండ‌టంతో, నేతలంతా… టికెట్ల కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. అయితే… టీడీపీ నుండి టికెట్లు ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు బాబుతో భేటీ అయ్యారు.

టీటీడీపీ అద్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ‌తో పాటు సీనీయ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చంద్ర‌బాబును కలిసేందుకు అమ‌రావ‌తి వెళ్లారు. అక్క‌డ తెలంగాణ‌లో కాంగ్రెస్ ఇస్తామ‌ని  చెప్పిన సీట్ల‌తో పాటు, పార్టీకి ఉన్న అబ్య‌ర్థులు, ఆశావాహుల జాబితా అందించి, తుది నిర్ణ‌యం పార్టీ అద్య‌క్షుడికే క‌ట్ట‌బెట్టారు. దీంతో… బాబు లిస్ట్ ను ఫైన‌ల్ చేస్తామ‌ని చెప్పారు. అయితే… అక్క‌డి వెళ్లిన నేత‌ల‌కే టికెట్లు ఇచ్చే అవ‌కాశం లేక‌పోటం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. సాధార‌ణంగా అయితే… పార్టీలోని కీల‌క వ్య‌క్తుల‌కు టికెట్లు వ‌చ్చేలా చూసుకుంటారు. కానీ ఇక్క‌డున్న ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

టీటీడీపీ అద్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ జ‌గిత్యాల నుండి ఆశించిన అక్క‌డ సిట్టింగ్ గా… జీవ‌న్ రెడ్డి కాంగ్రెస్ నుండి ఉన్నారు. దాంతో ఎల్.ర‌మ‌ణ‌కు స్థానం లేకుండా పోయింది. కోరుట్ల నుండి పోటీ చేయాల‌ని కోరినా అందుకు ఆయ‌న సుముఖంగా లేరు. ఇక మ‌రో సీనీయ‌ర్ నాయ‌కుడు రావుల ప‌రిస్థితి కూడా అదే. ఆయ‌న స్థానం వ‌న‌ప‌ర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి ఉన్నారు. దీంతో… ఆయ‌న‌కు కూడా స్థానం లేకుండా పోయింది. ఇప్పుడు వీరిద్ద‌రిని బుజ్జ‌గించే ప‌నిలో చంద్ర‌బాబు ఉన్నారు.  అందుకే చంద్ర‌బాబు బెంగ‌ళూరు వెళ్తూ.. కూడా వారిని వెంట‌తీసుకెళ్లి, స‌ముదాయించిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ నుండి వ‌చ్చే ఎమ్మెల్సీ ప‌దవుల్లో గానీ, లేక‌… అవ‌స‌ర‌మ‌యితే, ఏపీ కోటా నుండి అయినా… మీకు రాజ్య‌స‌భ లేదా ఎదైన మంచి ప‌ద‌వి వ‌చ్చేలా చూస్తాన‌ని హ‌మీ ఇచ్చార‌న్న ప్ర‌చారం సాగుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*