డైరెక్ట‌ర్ సుకుమార్ బార్య ఆ ప‌ని చేస్తోందా…..?

Read Time: 0 minutes

స్టార్ డైరెక్ట‌ర్లకు, స్టార్ హీరోలకు రెమ్యూన‌రేష‌న్ సంగ‌తి ఎంతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. కోట్ల‌లో సంపాద‌న‌, పైగా… యాడ్స్ తో… రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే… వారి భార్య‌లు పెద్ద‌గా బ‌య‌ట‌కు క‌న‌ప‌డకున్నా, వారు కూడా ఎదో ప‌ని చేస్తూ… బాగానే వెన‌కేసుకొస్తున్నారు.

సీనీ స్టార్స్… భార్య‌లంతా ఇప్పుడు త‌మ‌కు ఇష్టం ఉన్న బిజినెస్ లోకి ఎంట‌ర‌యిపోతున్నారు. ఒక‌రు ఆర్గానిక్ మిల్క్ పేరుతో, మ‌రొక‌రు హ‌స్పిటాలిటీ బిజినెస్ తో, ఇలా ర‌క‌ర‌కాలుగా ఎవ‌రికితోచిన బిజినెస్ లో వారు ఇమిడిపోతున్నారు. పైగా వీరంతా… త‌మ త‌మ బిజినెస్ లో స‌క్సెస్ అయి, భ‌ర్త‌కు త‌గ్గ భార్య‌లు అనిపించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ భార్య కూడా బిజినెస్ స‌ముహంలోకి వ‌చ్చేసింది.

సుకుమార్ స‌తీమ‌ణి…  మరో ఇద్ద‌రు పార్ట్ న‌ర్స్ తో క‌లిసి ఓ ప్ర‌ముక సంస్థ ప్రాంచైజ్ తీసుకున్నారు. లాంట్రీకార్ట్ సంస్థ‌ను స్థాపించిన వీరు… ప్రీమీయం సెంట‌ర్ల‌లో కేపీహెచ్ బీ, మియాపూర్, లాంకో హిల్స్ లాంటి చోట్ల బ్రాంచీలు ఏక కాలంలో ఓపెన్ చేశారు. ఖ‌రీదైన చీర‌లు, ప్రీమియం సూట్స్…. వాషింగ్, ఐర‌న్ చేసి… డోర్ డెలివ‌రీ ఇస్తుంది వీరి కంపెనీ. చాలా పెద్ద సంస్థ‌తో మూడు బ్రాంచీలు ఏక‌కాలంలో ఒపెన్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన వీరు, త్వ‌ర‌లో మ‌రిన్ని బ్రాంచీలు ఓపెన్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది.

మేం ఏమ‌న్నా త‌క్కువా… లేక‌, భ‌ర్త‌తో పోటీప‌డి సంపాదిస్తా అని చాలేంజ్ చేశారో ఏమో గానీ, భ‌ర్త‌ల‌కు ఏమాత్రం తీసిపోకుండా… బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు బార్య‌మణీలు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*