తాగి నటించ‌టం నాకు అల‌వాటే అంటోన్న లెజెండ‌రీ యాక్ట‌ర్.

Read Time: 0 minutes

ఆయ‌నకు క్లాస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన పేరుంది. మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆల‌రించిన ట్రాక్ రికార్డుంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, విల‌న్ గా అన్ని పాత్ర‌ల‌కు న్యాయం చేసి, మెప్పించిన లెజెండ‌రీ యాక్ట‌ర్… నేను తాగేసి న‌టించా అంటూ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఈ కొత్త విష‌యాన్ని జ‌నంకు చెప్పి, స‌మ‌ర్థించుకున్నాడు.

జ‌గ‌ప‌తిబాబు… తెలుగు సినిమా ప‌రిచ‌యం ఉన్న‌వారికి, ఈ పేరు కూడా ప‌రిచ‌యం ఉంటుంది. అయితే… ఈ మ‌ద్య విల‌న్ గా ఆయ‌న అభిమానుల‌ను మెప్పించారు. ఇటీవ‌ల విడుద‌లై… సంచ‌ల‌న విజ‌యం సాధించిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాలో ఎన్టీయార్ కు ఎన్ని మార్కులు ప‌డ్డాయో… అంతేస్థాయిలో జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌కు మార్కులు ప‌డ్డాయి. అయితే… ఈసినిమాలో తాను తాగి న‌టించాన‌ని, ఇది త‌న‌కు కొత్తేమి కాదంటూ… ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశారు.

నేను ఏమైనా…తాగేసి,  మ‌ర్డ‌ర్లు, ఖూనీలు, రేపులు చేశానా…. కొన్న సీన్ల‌లో ఆ సీన్ పండాలంటే త్రాగి నటిస్తే మంచిగా వ‌స్తుంద‌ని భావించా. గ‌తంలోనూ… మా నాన్న నాకు అడవిలో ఓ సినిమాలో న‌టించాలంటే… మందేయ్ అని బాటిల్స్ కూడా పంపేవాడు. ఇప్పుడు తానూ అదే చేశాన‌ని తెలిపారు. ఏం చేసినా సినిమాలో న‌ట‌న కోస‌మేన‌ని, అది తాను వ్య‌స‌నంగా భావించ‌టం లేద‌ని తెలిపారు. దీంతో… జ‌గ‌ప‌తి తాగి న‌టిస్తాడా అంటూ, అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*