తాజా స‌ర్వేలో… కూట‌మి త‌రుపున‌ సీఎంగా ఆయ‌న‌కే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు

Read Time: 0 minutes

మ‌హ‌కూట‌మి గెలిస్తే… సీఎం అబ్య‌ర్థి ఎవ‌రు, మా పార్టీలో కేసీఆర్ ఒక్క‌రే సీఎం అబ్య‌ర్థి… కాంగ్రెస్ లో నేత‌లంతా సీఎం అబ్య‌ర్థులే అంటూ టీఆర్ఎస్ ఆరోప‌ణ‌ల‌కు ఇప్ప‌టికీ గానీ జ‌వాబు దొర‌క‌లేదు. తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న స‌ర్వేలో… కూట‌మి త‌రుపున సీఎం అబ్య‌ర్థిగా తిరుగులేని మ‌ద్ద‌తిచ్చారు ఆ నేత‌కు.

కొంత‌కాలంగా… టీఆర్ఎస్ పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా, ఆపార్టీ అద్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డికే జ‌నం మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. దాదాపు 2 ల‌క్ష‌ల‌కు పైగా తీసుకున్న సాంపుల్స్ లో, రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి పోలింగ్ బూత్ లో క‌నీసం ఒక్క‌రి సాంపుల్ అయినా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డ స‌ర్వేలో… ఉత్త‌మ్ కు కూట‌మి త‌రుపున సీఎంగా తిరుగులేని మ‌ద్దతు ల‌భించింది. కాంగ్రెస్ పార్టీలో… ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి 47.75శాతం ఓట్ల‌తో ముందంజ‌లో ఉన్నారు. ఆయ‌న‌కు పార్టీలో మ‌రే ఇత‌ర నేత పోటీలో లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఉత్త‌మ్ త‌ర్వాత కాంగ్రెస పార్టీ సీనీయర్ నేత‌, తాజా మాజీ ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డికి కేవ‌లం 21.4శాతం మంది మాత్ర‌మే సీఎం కావాలంటూ  మ‌ద్దుతు ప‌లికారు. ఇక చెప్ప‌లేం అనేవారితో పాటు, ఇత‌ర నాయ‌కులందరికీ క‌లిపి… 30శాతం ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు పలికారు.

అంటే, కాంగ్రెస్ లో సీఎం అయ్యే అర్హ‌త ఉన్న నేత‌గా… ఉత్త‌మ్ ప్ర‌జాభిమానాన్ని సంపాదించార‌ని ఈ స‌ర్వే ద్వారా అర్థ‌మ‌వుతోంది. ఇక ఈస‌ర్వేలో దాదాపు 66 సీట్ల‌తో మ‌హ‌కూట‌మి తెలంగాణ‌లో ప్ర‌బుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతుంద‌ని కూడా స‌ర్వే వెల్ల‌డించింది. అధికార పార్టీ అధికారాన్ని కోల్పోయి… 44 సీట్ల‌కే ప‌రిమితం కాబోతుండ‌గా, ఎంఐఎం 6 స్థానాలు, బీజేపీ 5 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

అయితే, ఈ స‌ర్వే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, స‌ర్వేల‌పై ఇప్ప‌టికే ఈసీ నిషేధం విదించింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*