తుంగ‌తుర్తి సీటుపై కోమ‌టిరెడ్డి వ‌ర్సెస్ దామోద‌ర్ రెడ్డి

Read Time: 0 minutes

ఎప్పుడూ హ‌ట్ హ‌ట్ గా ఉండే  న‌ల్గొండ రాజ‌కీయాలు… మ‌రోసారి అదే వేడిని ర‌గిలిస్తున్నాయి. ముఖ్యంగా సీట్ల కేటాయింపుల విష‌యంలో… ఎవ‌రికి వారు త‌మ అనుచ‌రుగ‌ణానికే సీటు ఇప్పించుకునేందుకు పోటీప‌డుతున్నారు. న‌ల్గొండ‌లోని రిజ‌ర్వ్ స్థాన‌మైన తుంగతుర్తి సీటు ఇప్పుడు న‌ల్గొండలోని సీనీయ‌ర్ నేత‌లు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్, రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డిల మ‌ద్య అగ్నికి ఆజ్యం పోస్తుంది.

తుంగ‌తుర్తి సీటు కోసం… స్థానికంగా ఉండే డా.ర‌వితో పాటు తెలంగాణ జెఎసీలో ప‌నిచేసిన అద్దంకి ద‌యాక‌ర్లు పోటీప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అద్దంకి ద‌యాక‌ర్ ఇక్క‌డ నుండి పోటీచేసి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. కానీ అక్క‌డ స్థానికంగా ప‌ట్టున్న డా.ర‌వి ప‌నిచేకుంటూ వ‌చ్చారు. గ‌తంలో తుంగ‌తుర్తి నుండి ప్రాతినిద్యం వ‌హించి, స్థానికంగా ప‌ట్టున్న దామోద‌ర్ రెడ్డి అండ‌తో ర‌వి సీటుపై ఆశ‌పెట్టుకున్నారు. గ‌తంలో దామోద‌ర్ రెడ్డిని ప‌ట్టించుకోకపోవ‌టం వ‌ల్లే అద్దంకి ద‌యాక‌ర్ ఓడిపోయార‌న్న ప్ర‌చారం ఉంది. అద్దంకి ద‌యాక‌ర్ మాత్రం కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అండ‌తో… సీటుపై ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ…  తుంగ‌తుర్తి సీటు డా.ర‌వికి ఖాయ‌మైపోయింది. దీంతో… కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కినుక వ‌హించారు. తుంగ‌తుర్తి సీటు త‌మ వ‌ర్గ నాయ‌కుడికే ఇవ్వాలంటూ ప‌ట్టుబ‌డుతుండ‌టం, దామోద‌ర్ రెడ్డి వ‌ర్గ నాయ‌కుడికి సీటు ప‌క్కా కావ‌టంతో…. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ వ‌ర్సెస్ దామోద‌ర్ రెడ్డిలా మారిపోయింది తుంగతుర్తి సీటు. దీంతో… ఈ నాయ‌కులు క‌లిసి పనిచేస్తే…. భారీ మెజారిటీతో గెలిచే స్థానం, గెలుపోట‌ముల‌పై ప్ర‌భావం చూపుతుందా అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. అయితే, అసంతృప్తుల‌తో ట‌చ్ లో ఉన్న కాంగ్రెస్ పెద్ద‌లు…. తుంగతుర్తి విష‌యంలో, ఎలా స‌ర్దుబాట్లు చేస్తుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*