తెలంగాణ‌లో కాంగ్రెస్, ఏపీలో జ‌గ‌న్. నేష‌న‌ల్ మీడియా స‌ర్వే.

Read Time: 1 minutes

ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో కేసీఆర్ అధికారం పొగొట్టుకున్న‌ట్లేన‌ని, తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోందంటోంది జాతీయ మీడియా. మీడియా స్టార్ అర్ణ‌బ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ స‌ర్వేలో… కాంగ్రెస్ బ‌లం పుంజుకుంటుంద‌ని, కేసీఆర్ త‌న ప్ర‌భావాన్నికోల్పోతున్నార‌ని స‌ర్వే స్ప‌ష్టం చేస్తోంది.

తెలంగాణ‌లో మ‌హ‌కూటమి ఆద్వ‌ర్యంలో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు వెళ్తే… కాంగ్రెస్ పార్టీ 32.2శాతం ఓట్ల‌తో 8 సీట్లు గెలుస్తుంద‌ని తెలిపింది. 2014లో కాంగ్రెస్ కేవ‌లం 2 స్థానాల్లో మాత్ర‌మే గెలుపొందింది. ఇక 2014లో టీఆర్ఎస్ 11స్థానాల‌ను కైవ‌సం చేసుకోగా…. ఈసారి 30.40శాతం ఓట్ల‌తో 7 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తెలిపింది. ఇక బీజేపి 19శాతంతో ఒక స్థానాన్ని నిల‌బెట్టుకోగా, ఎంఐఎం త‌న సొంత స్థానాన్ని మ‌ళ్లీ గెల‌వ‌బోతుంది. అంటే… తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయని, రోజురోజుకు ఈ వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఇక‌, ఏపీలో… చంద్ర‌బాబు కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌ద‌ని, జ‌గ‌న్ పార్టీ ఎక్కువ‌స్థానాలు కైవ‌సం చేసుకుంటుంద‌ని తెలిపింది. మొత్తం 25 లోక్ స‌భ స్థానాల్లో… 20స్థానాల్లో వైసీపీ గెల‌వ‌బోతుంద‌ట‌. వైసీపీకి 41.2శాతం ఓట్లు వ‌స్తాయ‌ని తెలిపింది. టీడీపీ 31.2శాతంతో కేవ‌లం 5 స్థానాల‌కే ప‌రిమితం అవుతుంద‌ని, కాంగ్రెస్-బీజేపిలు ఖాతా తెరిచే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేసింది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో… వైసీపీ 8, బీజేపి 1 స్థానాలు గెల‌వ‌గా… టీడీపీ 16స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నిక‌ల్లో బీజేపి- టీడీపీ క‌లిసి పోటీచేశాయి.

మొత్తంగా… కొంత క్రేడిబిలిటీ ఉన్న జాతీయ మీడియా స‌ర్వే ఫ‌లితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*