తెలంగాణ లో ఊహించని ఫలితాలు రాబోతున్నాయంటున్న ఆంద్రా ఆక్టోపస్.

Read Time: 0 minutes

తెలంగాణ లో ఎవరూ ఊహించని రీతిలో ఫలితాలు ఉండబోతున్నాయని ఆంద్రా ఆక్టోపస్ గా ముద్రపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. గతానికి భిన్నంగా ఈ సారి 7,8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారు అని లగడపాటి బాంబు పేల్చాడు.

మహబూబ్ నగర్ జిల్లా  నారాయణ పేట నుండి కాంగ్రెస్ రెబెల్ శివకుమార్ రెడ్డి, అదిలాబాద్ జిల్లా బోథ్ స్థానం నుండి కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారని ప్రకటించారు. దింతో… తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే రోజుకు రెండు పేర్ల చొప్పున ఇండిపెండెంట్ గా గేలవబోతున్న పేర్లు వెల్లడిస్తా అని చెప్పారు. దింతో అంత ఎక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే…. హంగ్ అసెంబ్లీ కి దారి తీస్తుందని అంతా ఊహించారు. అయితే… హంగ్ వచ్చే పరిస్థితి లేదని, ఒక పార్టీ కె పూర్తి మెజార్టీ రాబోతుందని లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. పూర్తి వివరాలు పోలింగ్ ముగిశాక వెల్లడిస్తా అని ప్రకటించారు.

అయితే దీనిపై రాజకీయ పార్టీలు బిన్నంగా స్పందిస్తున్నాయి. మేమంటే మేమె గెలుస్తామని చెప్తూనే…. ఫలితాల కోసం వేచిచూద్దాం అంటున్నాయి. అయితే…. రెండు నెలల క్రితమే ఓ సర్వే చేశానని, ఆ సర్వే లో టీఆరెస్ కు 90 సీట్లు, కాంగ్రెస్ కు 15 సీట్లు వస్తాయని వచ్చినా…. ఇప్పుడు పరిస్థితి భారీగా మారిందని…. ఆది ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని గంటా పథంగా లగడపాటి నొక్కి చెప్పారు.

అయితే…. దీనిపై అధికార టీఆరెస్ మాత్రం టీఆరెస్ గెలవబోతుందని ధీమాగా ఉంటే, బీజేపీ మాత్రం హంగ్ అసెంబ్లీ పై ఆశలు పెట్టుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటే కచ్చితంగా హుంగ్ అని వాదిస్తోంది.

దింతో… ఎవరికి వారు లెక్కలు వేసుకుంటుంటే…. లగడపాటి తో పరిచయం ఉన్న నేతలు మాత్రం మా పరిస్థితి ఏంటి, గెలిచే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి, ఎక్కడ… ఏ మండలంలో వెనకపడ్డాం అన్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*