తెలుగు హీరోల‌ను అస్స‌లే ప‌ట్టించుకోని ప్రియా వారియ‌ర్.

Read Time: 0 minutes

ప్రియా వారియ‌ర్. పేరుకు చిన్న న‌టియే గానీ… సినిమా రిలీజ్ కు ముందే ఎంత పెద్ద పేరు వ‌చ్చిందో అందిరీకీ తెలుసు. ఒక్కసారి క‌న్నుకొట్టి దేశంలోని కుర్ర‌కారును ఇట్టే క‌ట్టిప‌డేసింది. అమ్మాయి అంటే ఇలా ఉండాల‌న్న‌ట్లు… యూత్ అంతా ఫీల‌య్యారు.  ఇంకా ఆ అమ్మాయి కోసం స‌ర్చ్ చేస్తూనే ఉన్నారు.

దీంతో…ఆ అమ్మాయి క్రేజ్ ను తెలుగులో వాడుకునేందుకు పెద్ద పెద్ద  నిర్మాత‌లు ట్రై చేస్తున్నా… ప్రియా వారియ‌ర్ మాత్రం నో  చెప్తున్నార‌ట‌. ఆ మ‌ద్య వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ లో సినిమా కోసం దిల్ రాజు భారీగా ఆఫ‌ర్ చేసినా, హీరో అఖిల్ అని తెలియ‌గానే మొహామాటం లేకుండా నో అనేసింద‌ట‌. ఆ త‌ర్వాత‌… అలాంటి ఆఫ‌ర్లు ఎన్ని వ‌చ్చినా ప్రియా వారియ‌ర్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల రీసెంట్ గా మెగా హీరోతో సినిమా కోసం ఆమెను మ‌రోసారి కాంటాక్ట్ చేసినా, ఫ‌లించ‌లేద‌ట‌. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, త‌న రెండో  సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌బోతుంది. పులి వాసు అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమా తీయ‌బోతున్నారు. ఆ సినిమాకు ప్రియా వారియ‌ర్ ను అడ‌గ‌టం, ఆమె యాజ్ యూజువ‌ల్ గా నో చెప్ప‌టం జ‌రిగిపోయాయ‌ట‌.

అయితే, ఆమె తెలుగు సినిమాలు చేయ‌కూడ‌ద‌ని రూలేమ‌న్న పెట్టుకుందా అంటే అదీ లేదు. పెద్ద హీరోల‌తో అయితేనే సినిమా చేస్తాన‌ని… అమౌంట్ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టింపులేమీ లేవ‌ని తేల్చి చెప్పింద‌ట‌. టాలీవుడ్ అయినా, మరేద‌యినా… పెద్ద హీరోల స‌ర‌స‌న అయితే ఖ‌చ్చితంగా న‌టిస్తాన‌ని చెప్పింద‌ని స‌మాచారం.

ఇదిలావుంటే, అక్కినేని అఖిల్ తో మాత్రం ఓ తెలుగు యాడ్ లో న‌టించింది ప్రియా వారియ‌ర్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*