దీపికా, క‌త్రినా కొట్టుకుంటూనే ఉన్నారా….?

Read Time: 1 minutes

స్టార్ హీరోయిన్, బాలీవుడ్ అందాలన‌టి దీపికా ప‌దుకొనే, బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌ణ‌వీర్ లు ప్రేమ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్రేమ బంధం బ‌ల‌ప‌డ‌టంతో… ఈనెల 14,15 తేదీల్లో… పెళ్లితో ఒక్క‌ట‌యి… కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్ప‌టికే… ఇరువురి ఫ్యామిలీస్ ఇటలీ చేరుకున్నాయి. ఇటలీలో వివాహం జ‌ర‌గ‌బోతుంది.

అయితే… ఈ వివాహా వెడ్డింగ్ కార్డ్స్  పంపిణీ ఇప్ప‌టికే చేసేశార‌ట‌. ఇద్ద‌రు న‌టులు కూడా… త‌మ వెడ్డింగ్ కార్డును సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తోనూ పంచుకున్నా, గ‌తంలో గొడ‌ప‌డ్డ క‌త్రినాకు మాత్రం ఇంకా వెడ్డింగ్ కార్డు అంద‌లేద‌ట‌. దాదాపు బాలీవుడ్ స్టార్స్ అంద‌రికీ వెడ్డింగ్ కార్డు ఇచ్చినా… ఇంకా క‌త్రినాకు పిలుపు రాలేదంటే… పాత గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగిన‌ట్లు లేవంటున్నాయి బాలీవ‌డ్ వ‌ర్గాలు. కానీ క‌త్రినా మాత్రం… కొద్ది రోజుల కింద ఓ టీవీ షోలో ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేసింది. దీపికా–ర‌ణ‌వీర్ ల వివాహం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని, ఎప్పుడెప్పుడు వారి వివాహ వేడుక‌ల్లో పాల్గొన‌లా అన్నంత ఆనందంగా ఉంద‌ని చెప్పింది. కానీ… దీపిక మాత్రం ఇంత‌వ‌ర‌కు క‌త్రినాను పిల‌వ‌లేదు. గ‌తంలో… ర‌ణ‌వీర్ క‌త్రినాలు ప్రేమ‌లో మునిగిపోయిన వారే. చాలా కాలం వీరిద్ద‌రు ప్రేమించి, డేటింగ్ చేసిన త‌ర్వాత‌… ఎందుకో ఇద్ద‌రు విడిపోయారు.  అప్ప‌ట్లోనే క‌త్రినా–దీపిక మ‌ద్య కొంత గ్యాప్ వ‌చ్చింద‌ని, అది ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

అది దృష్టిలో పెట్టుకునే.. దీపికా క‌త్రినాను త‌న పెళ్లికి ఆహ్వ‌నించ‌లేదు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*