నిరుద్యోగుల ఊసే ఎత్త‌ని కేసీఆర్… ఆందోళ‌న‌లో టీఆర్ఎస్ అబ్య‌ర్థులు.

Read Time: 0 minutes

కేసీఆర్ వ‌స్తే… త‌మ‌కు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పోతుంది, కేసీఆర్ చూసి ఓటేస్తారు… అబ్య‌ర్థుల‌పై వ్య‌తిరేక‌త ఉన్నా, కేసీఆర్ కోసం ఓటేస్తారంటూ ఇన్నాళ్లుగా ఆశించిన టీఆర్ఎస్ అబ్య‌ర్థులు, పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. అన్ని చోట్ల వ్య‌క్త‌మ‌వుతోన్న ఓ అంశం నిరుద్యోగ అంశం.

కేసీఆర్ కు వ్య‌తిరేకంగా, కేసీఆర్ స‌ర్కార్ పై అసంతృప్తిగా ఉన్న వ‌ర్గాల్లో యువ‌త ఒక‌టి. తెలంగాణ ఉద్య‌మంలోనే ఉన్న నియామ‌కాల‌పై యువ‌త ఎంతో ఎదురుచూసినా, అనుకున్న మేర ఉద్యోగాల క‌ల్ప‌న‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వెనుక‌బ‌డింది. దీంతో… ఆయా వ‌ర్గాల్లో కేసీఆర్ పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. కానీ, వ‌చ్చే ప్ర‌బుత్వంలో నిరుద్యోగుల‌కు ఏం చేస్తావో చెప్తారు అని అంతా ఎదురుచూస్తున్నా, కేసీఆర్ నోటి నుండి నిరుద్యోగ స‌మ‌స్య కానీ, ఉద్యోగాల క‌ల్ప‌న‌, నోటీఫికేష‌న్ల మాట కూడా రావ‌టం లేదు. ఆ మాటే ఎత్త‌కుండా… కేసీఆర్, కేవ‌లం పెన్ష‌న్లు, రైతుబందు పేర్ల‌తో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. దీంతో… యువ‌త‌కు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా మారిపోతుంది. ఇప్ప‌టికీ చేయ‌లేదు, ఇక మీద చెస్తాన‌ని కూడా చెప్ప‌టం లేదు. ఇంకా కేసీఆర్ పార్టీకి ఎందుకు అండ‌గా ఉండాల‌ని… టీఆర్ఎస్ ను గ్రామాల్లో నిల‌దీస్తున్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా చేరిన ఓటర్ల శాతం గ‌ణ‌నీయంగా ఉంది. వారంతా… తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న వారే. వారంతా… ఇప్పుడు నోటీఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్న వారే కావ‌టంతో… ఈ ఎన్నిక‌ల్లో వారి ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉండ‌నుంది. వారు ఒక్క‌రే కాదు, వారు క‌నీసం న‌లుగురిని ప్ర‌భావితం చేయ‌గ‌ల నిరుద్యోగులు. పైగా… త‌మ బిడ్డ‌ల‌కు ఉద్యోగాల విష‌యంలో, వారి వారి త‌ల్లిత్రండుల‌కు తీవ్ర అసంతృప్తి ఉంది.

దీంతో.. టీఆర్ఎస్ అబ్య‌ర్థులు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మా అద్య‌క్షుడు వ‌స్తే… అసంతృప్తి పోతుంది అనుకుంటే, స‌మ‌స్య మ‌రింత తీవ్రం అయ్యేట్లు ఉందంటూ…. పెద‌వి విరుస్తున్నారు. ఇక, నిరుద్యోగ యువ‌త కూడా… కేసీఆర్ కు త‌మ శ‌క్తి చూపించాలంటోంది ఓయూ జెఎసీ.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*