పర‌కాలను ప‌క్క‌న‌పెట్టి… పాల‌కుర్తిలో కొండా వ‌ర్గం.

Read Time: 1 minutes

పర‌కాలను ప‌క్క‌న‌పెట్టి… పాల‌కుర్తిలో కొండా వ‌ర్గం.

అదేంటీ… ప‌ర‌కాల‌లో క‌దా, కొండా సురేఖ పోటీ చేస్తోంది. మ‌రీ.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని కాద‌ని, పాల‌కుర్తిలో ఏం ప‌ని అనుకుంటున్నారా…? శ‌త్రువుకు శ‌త్రువు మిత్రువు అనే సామేత‌ను ఫాలో అవుతున్నారు కొండా దంప‌తులు. త‌మ‌ను టీఆర్ఎస్ నుండి వెళ్ల‌గొట్టేలా చేసింద‌నే ప‌గ‌తో ఉన్నారు కొండా వ‌ర్గం.

కొండా దంప‌తుల‌కు– ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావుల మ‌ద్య ఉన్న వైరం ఈనాటిది కాదు. ఈమ‌ద్య వ‌ర‌కు ఒకే పార్టీలో టీఆర్ఎస్ లో ఉన్నా… ఆ గొడ‌వ‌లు అలాగే ఉన్నాయి. కానీ, త‌న‌కు రెండు సీట్లు అడిగితే క‌నీసం ఓక్క‌సీటు కూడా ద‌క్క‌కుండా చేయ‌టంలో ఎర్రబెల్లి పాత్రే కీల‌క‌మైంద‌ని భావిస్తోన్న‌, కొండా వ‌ర్గం… అందుకు బ‌దులు తీర్చుకునేందుకు… రెడీ అయిపోయింది. పాల‌కుర్తి నుండి టీఆర్ఎస్ త‌రుపున పోటీలో ఉన్న ఆయ‌న్ను ఓడించ‌ట‌మే ల‌క్ష్యంగా ప‌ర‌కాల వ‌దిలి మ‌రీ,. పాల‌కుర్తిలో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. కాంగ్రెస్ త‌రుపున పాల‌కుర్తి బ‌రిలో ఉన్న జంగా రాఘ‌వ‌రెడ్డి గెలుపు కోసం ప‌నిచేస్తున్నారు. పాల‌కుర్తిలో ఉన్న 6 మండలాల‌ను ఇప్ప‌టికే చుట్టేసి వ‌చ్చారు కొండా సురేఖ‌. త‌న‌కు ప‌ర‌కాల‌లో గెలుపు న‌ల్లేరుపై న‌డకేన‌ని, అందుకే… ద‌యాక‌ర్ రావు ను ఓడించేందుకు పూనుకున్నామంటున్నారు.

ఈ పాల‌కుర్తి ఒక్క‌చోటే కాదు… త‌మ‌ను అవ‌మాన ప‌ర్చార‌న్న క‌సితో ఉన్న కొండా ముర‌ళి, ఆయ‌న వ‌ర్గం నేత‌లంతా ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యారు. ప‌ర‌కాల‌, పాల‌కుర్తిలో మాత్ర‌మే కాదు.. త‌మ పాత నియోజ‌క‌వ‌ర్గం అయిన వ‌రంగ‌ల్ రూర‌ల్, భూపాల‌ప‌ల్లిలో కూడా కాంగ్రెస్ గెలుపుకోసం త‌మ వంతు కృషి చేస్తున్నారు. ఎలాగైనా వ‌రంగ‌ల్ జిల్లాలో టీఆర్ఎస్ ను నామ‌రూపాలు చేయ‌కుండా చూడ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని, అందుకోసం… ప్ర‌చారాలు నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్నారు.

చూడాలి మ‌రీ.. కొండా దంప‌తుల క‌సి ఎంత‌మేర‌కు ఫ‌లిస్తుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*