
తెలంగాణ కోసం…నేను కొట్లాడినప్పుడు అందరినీ కలుపుకొని పోయిన. అట్లనే ఇప్పుడు కేసీఆర్ ను గద్దె దింపేందుకే… మళ్లీ కూటమిలో కలిసిన. ఎందుకు కలిసినవ్ అని అడుగుతుర్రు… ప్రజలకిచ్చిన హమీల అమలు సాధనకే నేను కాపలా ఉంటానని స్పష్టం చేశారు ప్రజా ఫ్రంట్ కన్వీనర్ కోదండరాం.
ఫాంహౌజ్ లో పడుకునే కేసీఆర్ మనకెందుకు… మళ్లీ ఆయన్ను ఫాంహౌజ్ కే పంపుదం. తెలంగాణ అంటే ఒక్క కుటుంబం మాత్రమే కాదు… ఈ నాలుగు కోట్ల ప్రజలది. ఈ ప్రజల బతుకుల మార్పుకే ఐక్యం అయినం, గొంగలి పురుగును అయినా ముద్దుపెట్టుకుంటాం… తెలంగాణ అభివృద్దిని చేసిచూపిస్తాం అంటూ… ఉద్యమ తెలంగాణను కోదండరాం గుర్తుకుతెచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే బాధ్యత నాదని, ఖచ్చితంగా గెలిచి… అభివృద్ది చూపిస్తామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేసి… నీళ్లిచ్చే బాద్యత నాదని, లక్ష ఉద్యోగాల కల్పన చేసిచూపిస్తామని కోదండరాం హమీ ఇచ్చారు. మహకూటమిని ఆశీర్వదించండని కోరారు.
కరెంటు బిల్లులతో కేసీఆర్ చేస్తోన్న దీపిడీని… ఫ్యూయల్ విషయంలో ఉన్న టాక్స్ లపై ప్రజలకు విద్యార్థులకు పాఠం చెప్పినట్లు చెప్పటంతో పాటు, ఫ్రీ కరెంటుపై కోదండరాం వివరించిన తీరును అందరినీ ఆకట్టుకుంది. పీపుల్స్ ఫ్రంట్ చెప్పే ప్రతి మాటకు భాద్యత తీసుకుంటా. హమీలకు ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటు చేపిస్తా. నా గత చరిత్ర చూడండి… ఆ చరిత్ర చూశాకే మాకు మద్దతివ్వండంటూ కోరారు.
నీళ్లవాటం ఎటుంటదో మీ జనాలు చెబతున్నారు, గా నీళ్లు గిటు ఎట్ల వస్తయని… కానీ టీఆర్ఎస్ కు అర్థం అయితలేదు… అంటూ టీరెఎస్ కు చురకలంటిచారు.
బూటకపు హమీలకు లొంగొద్దని… కోదండరాం కోరారు.
Leave a Reply