పుల్ల‌లు పెట్ట‌డ‌మే నా ప‌ని –కోదండరాం.

Read Time: 1 minutes

ఇటీవ‌ల కేటీఆర్… ఓ స‌భ‌లో మాట్లాడుతూ, కోదండ‌రాం కు వేరే ప‌నులు ఏమీ లేవ‌ని, ఆయ‌న‌కు వాళ్ల‌కు-వీళ్ల‌కు పుల్ల‌లు పెట్ట‌డ‌మే ఆయ‌న ప‌ని అంటూ విమ‌ర్శించారు. అందుకే ఆయ‌న‌కు పుల్ల‌ల‌పెట్టే అంటే అగ్గిపెట్టే గుర్తువ‌చ్చింద‌ని, ఎన్నిక‌ల సంఘానికి ఈయ‌న గురించి తెలిసిందేమ‌న‌ని విమ‌ర్శించారు.

అయితే… దీనిపై స్పోర్టివ్ గా రియాక్ట్ అయ్యారు కోదండరాం. అవును… నిజ‌మే నాకు పుల్ల‌లు పెట్ట‌డ‌మే నా ప‌ని. కేటీఆర్ నిజమే చెప్పారు. నేను కూడా నిజాయితీగా, గ‌ర్వంగా చెబుతున్నా… నాకు పుల్ల‌లు పెట్ట‌డ‌మే నా ప‌ని అని. నేను తెలంగాణ ద్రోహుల‌కు, న‌మ్మించి మోసం చేసి… ప్ర‌జ‌ల‌ను వంచించిన టీఆర్ఎస్ నేత‌ల‌కు, ఆ పార్టీకి పుల్ల‌లు పెడుతున్నా అంటూ సమ‌ర్థించుకున్నారు. ఇక తమ అగ్గిపెట్టెను అంత చుల‌క‌న‌గా తీసుకోవ‌ద్ద‌ని…. మంచి చేసిన వారికి మంగ‌ళ‌హ‌ర‌తులు ప‌ట్టాల‌న్నా, చెడు చేస్తున్న వారికి పొగ పెట్టాల‌న్న అగ్గిపెట్టే త‌ప్ప‌నిస‌రి అని మ‌ర్చిపోవ‌ద్ద‌ని తెలిపారు. దీంతో… కోదండ‌రాం కు త్వ‌ర‌గానే రాజ‌కీయాలు వంట‌బ‌ట్టాయ‌ని, విమ‌ర్శ‌ల‌ను సైతం అనుకూలంగా మార్చుకుంటున్నార‌ని ఆయ‌న అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, ఈ రోజు ఉత్త‌మ్ తో… సీట్ల పంప‌కంపై మ‌రోసారి భేటీ కానున్నారు కోదండ‌రాం. తాము కూట‌మిలోనే ఉంటామ‌ని… కాంగ్రెస్ పెద్ద‌న్న పాత్ర పోషిస్తుంద‌ని తెలిపారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*