పూర్త‌యిన వ‌డ‌బోత‌, కూట‌మి త‌రుపునే అబ్య‌ర్థుల లిస్ట్.

Read Time: 0 minutes

కాంగ్రెస్ అబ్య‌ర్థుల లిస్ట్ వాయిదాల‌తో…. అసంతృప్తులు పెరిగిపోతున్నారు. రోజుకో పేరు తెర‌పైకి రావ‌టంతో, అబ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. కొండ నాలుక‌కు మందేస్తే… ఉన్న నాలుక ఊడిన‌ట్లు, ఎవ‌రో ఒక‌రిద్ద‌రు అసంతృప్తుల కోసం లిస్ట్ పోస్ట్ పోన్ చేస్తుంటే, ఇత‌ర సెగ్మెంట్ల‌లో అసంతృప్తి పెరుగుతోంది.

ఇప్ప‌టికే 74 మందితో లిస్ట్ రెడీ అయిపోయింది… 10 తేదీన అబ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేస్తాం అంటూ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ ఖుంతియా అది జ‌ర‌గ‌లేదు. దీంతో మ‌రింత అసంతృప్తి పెర‌గ‌టానికి తోడు, కూట‌మిలో సీట్ల పంప‌కాలు… ఎవ‌రికి ఏ సీటుపై స్ప‌ష్ట‌త కొర‌వడ‌టంతో… కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇక ఎలాగు లేట‌యింది, పైగా నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లైన నేప‌థ్యంలో… ఇలా చూస్తూ ఉండ‌కుండా, మ‌హ‌కూట‌మి త‌రుప‌నే అన్ని పక్షాల అద్య‌క్షులు క‌లిసి జాబితా విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌నలో ఉంది. ఇలా అయితే, కూట‌మికి కొంత వెయిట్ పెరుగుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తుండ‌గా, కూట‌మి ప‌క్షాల్లో కూడా అసంతృప్తి త‌గ్గే అవ‌కాశం వుంది.

వీట‌న్నింటికి తోడు… ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌, ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాకుంటే… గోవా, క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ ద్వారా టీఆర్ఎస్ కు అనుకూలంగా బీజేపి పావులు క‌దిపే చాన్సుంటుంది, అలా కాకుండా… కూట‌మి ద్వారా అబ్య‌ర్థుల లిస్ట్  విడుద‌ల చేయ‌టం ద్వారా ప్ర‌క‌టిస్తే… ఎన్నిక‌ల ముందే కూట‌మి కాబట్టి, వీరినే పిలిచే అన‌వాయితీ గ‌వ‌ర్న‌ర్ పాటించాల్సి ఉంటుంది. ఇలా అన్ని అంశాలు ఆలోచించే… కాంగ్రెస్ పెద్ద‌లు మ‌హ‌కూట‌మి త‌రుపునే లిస్ట్ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక కాంగ్రెస్ అబ్య‌ర్థుల వ‌డ‌బోత పూర్త‌యింద‌ని స‌మాచారం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*