పొడిచిన పొత్తులు… కుదిరిన సీట్ల స‌ర్దుబాటు.

Read Time: 0 minutes

తెలంగాణలో కేసీఆర్ ఓట‌మే ద్యేయంగా ఒక్క‌టైన తెలంగాణ ప్ర‌తిప‌క్షాల మ‌ద్య‌… కొంత కాలంగా ఏర్ప‌డిన సందిగ్థ‌త‌కు దాదాపు తెర‌ప‌డింది. సీట్ల సంఖ్య‌పై నెల రోజుల నుండి జ‌రిగిన ఎడ‌తెరిపిలేని చ‌ర్చ‌ల‌కు కాంగ్రెస్ అధిష్టానం పుల్ స్టాప్ పెట్టింది. కాంగ్రెస్ స‌హ ఇత‌ర పార్టీల సీట్ల‌ను ప్ర‌కించింది.

మొత్తం 119 స్థానాల్లో… కాంగ్రెస్ కూట‌మి పెద్ద‌న్నగా మెజారిటీ సీట్ల‌లో పోటీచేయ‌బోతుంది. మ‌హ‌కూట‌మిలోని భాగ‌స్వామ్య ప‌క్షాల‌యిన‌… టీ.టీడీపీకి 14 స్థానాలు, టీజెఎస్ కు 8, సిపిఐ కి 3 స్థానాలు ఇవ్వ‌నుండ‌గా, తెలంగాణ ఇంటిపార్టీకి అవ‌స‌ర‌యితే… ఒక్క స్థానాన్ని కేటాయించి, మిగిల‌న స్థానాల్లో కాంగ్రెస్ పోటీచేయాల‌ని నిర్ణ‌యించింది. ఏయే స్థానాలు అనేవి అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికే కాంగ్రెస్ అబ్య‌ర్థుల లిస్టులో ఉన్న 95 లో 74 స్థానాల‌కు అబ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేసిన ఆ పార్టీ, మిగ‌తా ప‌క్షాల‌తో క‌లిసి… శ‌నివారం ఉద‌యం లేదా శుక్ర‌వారం సాయంత్రం ఉమ్మ‌డి జాబితాను ప్ర‌క‌టించ‌నుంది. మిగిలిన స్థానాల‌పై ఇంకా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉండ‌టంతో, ఈ నెల 12 త‌ర్వాత ఏ క్ష‌ణ‌మైనా రెండో జాబితాను ప్ర‌క‌టించాల‌ని డిల్లీలో భేటీ అయిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ నిర్ణ‌యించింది. నేత‌ల వార‌సుల సీట్ల‌తో పాటు, ఇద్ద‌రు బ‌ల‌మైన నేత‌ల మ‌ద్య ఏర్ప‌డిన సీట్ల పంచాయితీ పై పూర్తిస్థాయిలో బుజ్జ‌గింపుల ప‌ర్వం న‌డించిదంటున్నాయి డిల్లీ వ‌ర్గాలు. అయితే, అధిష్టానం మాత్రం గెలుపు గుర్రాల‌కే టికెట్లు కేటాయిస్తున్నామ‌ని, మిగిలిన వారు స‌హ‌కరిస్తే… పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంద‌ని హ‌మీ ఇచ్చినట్లు ప‌లువురు నేత‌లు తెలిపారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*