పొడిచిన పొత్తులు, 8న జాబితా

Read Time: 0 minutes

మ‌హ‌కూట‌మిలో భాగంగా… కాంగ్రెస్ తో జ‌త‌కట్టిన టీడీపీ, టీజెఎస్, సిపిఐల‌తో సీట్ల స‌ర్ధుబాటు ఓ కొలిక్కి వ‌చ్చింది. యూపియే చైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ ఆద్వ‌ర్యంలో జ‌రిగిన ఎన్నిక‌ల క‌మిటీ భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు.

రాష్ట్రం పై పూర్తి ప‌ట్టున్న సోనియా ఆద్వ‌ర్యంలో కూట‌మిలో సీట్ల పంప‌కాలు, కాంగ్రెస్ త‌రుపున అబ్య‌ర్థుల ఎంపిక‌పై చ‌ర్చించారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 95 స్థానాల్లో పోటీచేయ‌నుండ‌గా, టీడీపీ 14 స్థానాల్లో బ‌రిలో ఉండ‌నుంది. ఇక టీజెఎస్, సిపిఐల సీట్ల సంఖ్య‌పై స్ప‌ష్ట‌త రాకున్నా… ఓ సీటు అటు ఇటు గా టీజెఎస్ 7 స్థానాల్లో, సిపిఐ 3 స్థానాల్లో పోటీ చేసే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా కూడా కొంత‌మేర‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 57 మంది అబ్య‌ర్థుల విష‌యంలో పార్టీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా, ఈ నెల 8న అబ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఉండ‌నుంద‌ని ఏఐసీసీ వ‌ర్గాలంటున్నాయి. అయితే… ఏ పార్టీ ఏ సీటులో పోటీ చేయాల‌నే దానిపై కూడా స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ప్పటికీ, ఇప్ప‌టి వ‌ర‌కు టీజెఎస్, సిపిఐల‌తో అధికారికంగా సీట్ల స‌ర్దుబాటు, సంఖ్య‌ల‌పై ఒప్పందం కుద‌ర‌ని కార‌ణంగా… బ‌య‌ట‌కు వెల్ల‌డించలేనట్లు తెలుస్తోంది. ఇక న‌వంబ‌ర్ 8న దాదాపు 57మందితో తొలి విడుత జాబితాను విడుద‌ల చేయ‌నుంది కాంగ్రేస్ కేంద్ర కార్యాల‌యం.

అయితే… సిపిఐకి హుస్నాబ్, కొత్త‌గూడెం, బెల్లంప‌ల్లి స్థానాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*