పొన్నం పాద‌యాత్ర‌… అసెంబ్లీకి రూటు వేసేనా…?

Read Time: 0 minutes

కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్,  క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ బ‌రిలో ఉన్నారు. అయితే… పోలింగ్ కు మ‌రో రెండు వారాలే మిగిలి ఉన్న స‌మ‌యంలో… పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు.

క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం… కాలి న‌డ‌క‌న తిరుగుతా, పైస‌లు పంచే రాజ‌కీయానికి చెక్ పెట్ట‌బోతున్నా, టీఆర్ఎస్ అబ్య‌ర్థి బ‌ల‌మైన వ్యాపారి. అది అంద‌రికీ తెలుసు… అందుకే ప్ర‌తి ఊరు తిరుగుతా, ప్ర‌తి గ్రామంలో ఓట్ల‌డుగుతా అంటూ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. స‌హ‌జంగా అబ్య‌ర్థులెవ‌రు పాద‌యాత్ర‌ల‌ను పొలింగ్ అతి ద‌గ్గ‌ర ఉండ‌గా చెపట్ట‌రు. కానీ.. భిన్నంగా పొన్నం ఎంచుకున్న పాద‌యాత్ర పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి.

క‌రీంన‌గ‌ర్ లో త్రిముఖ పోరు నెల‌కొంది. గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గంగుల క‌మ‌లాక‌ర్ టీఆర్ఎస్ నుండి, గ‌త ఎన్నిక‌ల్లో కొద్ది తేడాతో ఓడిపోయిన బండి సంజ‌య్ బీజీపీ నుండి పోటీలో ఉన్నారు. పొన్నం ప్ర‌భాక‌ర్ కు మంచి పేరున్నా… డ‌బ్బు ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌రీంన‌గ‌ర్ ఒక‌టి. దీంతో… ఆయ‌న గ్రామీణ ప్ర‌జానీకం పైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. అందుకే… గ్రామీణ ప్రాంతాల మండ‌ల కేంద్రాలు, అన్నీ గ్రామాలు ట‌చ్ అయ్యేలా… 8 రోజుల్లో నియోజక‌వ‌ర్గం తిరిగేలా ఆయ‌న ప్లాన్ చేసుకున్నార‌ని, చివ‌రి రోజుల్లో… ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రోడ్ షోలు చేయాల‌ని నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయ‌న‌, త‌న సీటు ను ఖ‌చ్చితంగా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అక్క‌డ ఓడితే… పార్టీ ప‌రువు కూడా పోతుంద‌ని, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించ‌కుండా… పొన్నం కు క‌రీంన‌గ‌ర్ గెలిచిరావాల‌ని సూచించార‌ట ఏఐసీసీ పెద్ద‌లు.

చూడాలి మ‌రీ,  పొన్నం పాద‌యాత్ర‌… అసెంబ్లీకి రూటు ఎంత‌వ‌ర‌కు క్లియ‌ర్ చేస్తుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*