పొన్నాల‌కు ఒకే, సికింద్రాబాద్ కు శ‌శిధ‌ర్ రెడ్డి… ?

Read Time: 0 minutes

రెండో లిస్ట్ నుండి… టికెట్ వ‌స్తుందా, రాదా అన్న టెన్ష‌న్ ప‌డ్డా పొన్నాల‌కు ఎట్ట‌కేల‌కు టికెట్ ల‌భించ‌గా, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డికి మాత్రం ఇంకా ఖ‌రారు కాలేదు. ఆయ‌న సీటును టీడీపీకి ఇచ్చేయ‌టంతో… ఆయ‌నేం చేయ‌బోతున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.

అయితే, శ‌శిధ‌ర్ రెడ్డి పార్టీ నిర్ణ‌యాన్ని ఒప్పుకునే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌టం లేదు. త‌న కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడి ఓ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్ప‌టంతో…స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది. ఆయ‌న వాఖ్యాలు గ్రేట‌ర్ కాంగ్రెస్ లో మంట‌లు రేపుతుండ‌గా, ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని… కోర్టుకీడ్చీంది శ‌శిధ‌ర్ రెడ్డే. ఆయ‌న‌కే టికెట్ లేక‌పోతే ఎలా అని, చాలా మంది కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న‌కు బాస‌ట‌గా నిలుస్తున్నారు. మర్రి శశిధర్ రెడ్డి ఆశిస్తున్న సనత్ నగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించింది. 2014లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 27,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు శశిధర్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ తరపున తలసాని బరిలో ఉన్నారు. నామినేషన్లకు తక్కువ సమయం ఉండటంతో శశిధర్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో అని చర్చనీయాంశంగా మారినా… సికింద్రాబాద్ స్థానం నుండి బ‌రిలోకి దింపితే ఎలా ఉంటుంది అని కాంగ్రెస్  పెద్ద‌లు ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఆయ‌న ఆలోచించుకొని చెప్తాన‌న్నార‌ని స‌మాచా

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*