పొన్నాల‌కు టికెట్ లేన‌ట్లే… బుజ్జ‌గించేందుకు రంగంలోకి రాహుల్ గాంధీ.

Read Time: 0 minutes

ఓవైపు టికెట్ల అమ్మ‌కాల అంశంతో… కుదుపుల‌కు లోన‌వుతున్న కాంగ్రెస్ పార్టీ, ఇత‌ర సీట్ల‌లో అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకే మొగ్గుచూపుతోంది. ఇప్ప‌టికే… తుది లిస్ట్ పై క‌స‌రత్తులు పూర్తికాగా, ఈ రాత్రికే జాబితా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఇక అసంతృప్తుల‌తో నేరుగా రాహుల్ మాట్లాడే అవ‌కాశం ఉంది.

జ‌న‌గాం నుండి బ‌రిలో ఉంటాన‌ని, ఓ ద‌శ ప్ర‌చారం కూడా పూర్తి చేసుకున్న మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మ‌య్య‌కు ఈసారి టికెట్ నిరాక‌రించ‌నుంది. ఈ సీటు నుండి కోదండ‌రాం పోటీచేయ‌బోతున్నారు. దీంతో పొన్నాల‌ను బుజ్జ‌గించేందుకు స్వ‌యంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. పొన్నాల తో పాటు, తుంగ‌తుర్తి  నుండి సీటు ఆశించిన అద్దంకి ద‌యాక‌ర్ తో పాటు, మ‌రో ఆశావాహుడు డా. ర‌వికుమార్ ను కూడా రేపు ఉద‌యం త‌న ఆఫీసుకు రావాలని రాహుల్ గాంధీ స‌మాచారం పంపించారు.

పొన్నాల‌, అద్దంకితో పాటు… మ‌రికొంత మంది నేత‌ల‌ను కూడా రాహుల్ గాంధీ పిలిచిన‌ట్లు తెలుస్తోంది. అందులో ఇబ్ర‌హీం ప‌ట్నం నుండి సీటు ఆశిస్తున్న మ‌ల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. సీటుపై కొంత‌మంది ఆశావాహులు ఇప్ప‌టీకీ డిల్లీలో ఉండి, సీటు కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో… సీనీయ‌ర్ నేత‌ల‌ను దూరం చేసుకోకుండా ఉండేందుకే రాహుల్ పిలిపించిన‌ట్లు తెలుస్తోంది. ఇక పొన్నాల ల‌క్ష్మ‌య్య గానీ, ఆమె కోడ‌లుకు గానీ ఎంపీగా అవ‌కాశం ఇచ్చే అవ‌కాశం ఉందంటోన్నాయి గాంధీబ‌వ‌న్ వ‌ర్గాలు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*