పోలీంగ్ బూతుల వ‌ద్ద‌… డ్రంక‌న్ డ్రైవ్స్….

Read Time: 1 minutes

పోలీంగ్ స్టేష‌న్ల వ‌ద్ద డ్రంక‌న్ డ్రైవ్స్ ఎంటీ అనుకుంటున్నారా… ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండటంతో రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంది. క‌ల్తీ మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా ప‌ల్లెల్లో కంపుకోడుతుంది. పైగా మ‌ద్యం పంపిణీ అనేది ప్ర‌లోభాల కింద‌కు వ‌స్తోంది. పోలీంగ్ ముందు రోజు మ‌ణీ-మ‌ద్యం పంపిణీకి అడ్డు అదుపు ఉండ‌దు. అందుకే ఇప్పుడు పోలీంగ్ బూతుల వ‌ద్ద డ్రంక‌న్ డ్రైవ్స్ చేయాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది.

అందులో భాగంగానే… ఓటర్లు  మద్యం సేవించి ఓటు వేయకుండా చూడాలని సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.  తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సుప్రీం తలుపు త‌ట్టారు.  పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బ్రీత్ అనలైజర్ల పరీక్ష చేయాలని, మ‌ద్యం సేవించిన వారిని ఓటు హ‌క్కు వినియోగించుకోనివ్వకుండా చూడాల‌ని పిటిష‌న్ లో కోరారు. మ‌ద్యం షాపుల‌ను ముందే మూసివేయిస్తున్నా… అబ్య‌ర్థులు భారీగా డంప్ చేసి, ప్ర‌లోభాలు చేస్తున్నారని, దాన్ని నివారించాల‌ని కోరారు.  గత ఎన్నికల్లో 272 కోట్ల విలువైన 2.12 కోట్ల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయాన్ని పిటిషన్ లో పొందుపర్చారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రాల దగ్గర బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేపట్టాలన్నారు. అలా ఎవరైనా మద్యం తాగి వచ్చినట్టు తేలితే వారిని ఓటు వేయడానికి అనుమతించవద్దన్నారు. తాగిన మత్తులో దేవ భవిష్యత్తును నిర్ణయించే అవకాశమే ఇవ్వద్దన్నారు.  దీపావళి సెలవుల తర్వాత ఈ కేసు విచారణకు రానుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*