ప్ర‌భాస్… ప‌రువుతీస్తోన్న ఆ ద‌ర్శ‌కుడెవ‌రు..?

Read Time: 0 minutes

ప్ర‌భాస్ అంటే… ఇప్పుడు టాలీవుడ్ మాత్ర‌మే కాదు, భారతీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ట‌క్కున గుర్తుప‌డుతుంది. ప్రేక్ష‌కుల‌కు కూడా ప్ర‌భాస్ ఎంతో ద‌గ్గ‌ర‌య్యాడు. బ‌హుషా… ఓ ద‌క్షిణాది న‌టుడు అందులోనూ తెలుగు న‌టుడు అన్నీ బాష‌ల్లో ఇంత త్వ‌ర‌గా గుర్తింపు తెచ్చుకున్న‌ది ప్ర‌భాస్ ఒక్క‌డే. అలాంటిది ఓ ద‌ర్శ‌కుడు ప్ర‌భాస్ ఫాన్స్ కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నార‌ట‌.

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత‌… ప్రభాస్ రేంజ్ వేరు. అందుకే బాహుబ‌లి సినిమా వచ్చి ఇన్నాళ్ల‌యినా… ప్ర‌భాస్ క్రేజ్ మాత్రం త‌గ్గ‌ట్లేదు. త్వ‌ర‌లో సాహో సినిమాతో ప్ర‌జ‌ల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కూడా హలీవుడ్ రేంజ్ లో ఉంటుంద‌న్న‌ది పాత వార్తే. అయితే… సాహో త‌ర్వాత సినిమా కూడా రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసిన ఈ ఫిల్మ్, త్వ‌ర‌లో స్పీడప్ కాబోతుంది.

అయితే, తాజాగా బ‌య‌ట‌కొచ్చిన ఓ అంశం… ప్ర‌బాస్ కొత్త సినిమా డైరెక్ట‌ర్ పై అంద‌రూ ఫైర్ అయ్యేలా చేస్తోంది. ప్ర‌భాస్ పై ఓ రోమాంటిక్, ల‌వ్ థ్రిల్ల‌ర్ సినిమా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌. అయితే… ఈ చిత్రం ఓ కొరియ‌న్ చిత్రానికి కాపీలా ఉంటుంద‌ని, ఆ కొరియ‌న్ సినిమానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ద‌ర్శ‌కుడు మార్పులు చేశార‌ని టాక్. దీంతో… ప్ర‌భాస్ ఫాన్స్ అంతా, అంత‌పెద్ద హీరోకి కాపీ క‌థా…? ఆయ‌న‌కు మ‌న‌సెలా ఒప్పిందంటూ ఫైర్ అవుతున్నారు. అయితే… దాదాపు 18 సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన ఆ కొరియ‌న్ సినిమా మై సీస్సీ గ‌ర్ల్  అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింద‌ట‌. ఆ త‌ర్వాత ప‌లు అంత‌ర్జాతీయ భాష‌ల్లో ఈ చిత్రం డ‌బ్ అయి, అన్నీంట్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిందంటోంది చిత్ర యూనిట్. మ‌రీ… తెలుగులో ఎంత‌వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*