ప‌ద‌వుల ఆశ‌లు మొద‌లుపెట్టిన టీ.టీడీపీ నేత‌లు

Read Time: 0 minutes

ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమ‌లింగం లా త‌యారైంది టీడీపీ ప‌రిస్థితి. ఇంకా ఎన్నిక‌లే కాలేదు… ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో… టీడీపీ నేత‌లు ఊహాల్లో మునిగి తేలుతున్నారు. పోనీ స‌ర్వేలన్నా… కూట‌మి విజ‌యానికి ఏక‌ప‌క్షంగా మ‌ద్ద‌తివ్వ‌టం లేదు. ఇలాంటి స్థితిలో టీడీపీ నేత‌ల కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

కూక‌ట్ ప‌ల్లి నుండి కూట‌మి అబ్య‌ర్థిగా నంద‌మూరి వార‌సురాలు సుహ‌సిని ఇప్పుడిప్పుడే ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. ఆమె కోసం త‌న అన్న‌ద‌మ్ములు… జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ప్ర‌చారం కూడా చేయ‌బోతున్నారు. అయితే… కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తే, సుహ‌సిని మంత్రి అవుతుందంటూ అప్పుడే టీడీపీ ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టేసింది. ఆమె మంత్రి కావ‌టం ఖాయం, మ‌ళ్లీ తెలంగాణ‌లో టీడీపీ చ‌క్రం తిప్ప‌టం ఖాయం అంటూ… టీడీపీ నేత‌లు వాఖ్యానిస్తున్నారు. ఇక‌, భ‌విష్య‌త్ రాజ‌కీయాల అవ‌స‌రాల‌ను బ‌ట్టి… రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ మ‌హ‌కూట‌మి ఇలాగే కంటిన్యూ అవుతుంద‌ని, అప్పుడు మ‌ల్కాజ్ గిరి సీటూ త‌మ‌దేనంటూ టీడీపీ బ‌రోసా ఉంది. టీడీపీ సీనీయ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అయితే… మల్కాజ్ గిరి ఎంపీ సీటు నాదేన‌ని, చంద్ర‌బాబు ఇప్ప‌టికే హ‌మీ కూడా ఇచ్చాడంటూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ట‌. దీంతో… కూట‌మిలోని ఇత‌ర ప‌క్షాలు, ఇదేం వింతా… అప్పుడే ఈ ప్ర‌చారాలేమీ అంటూ పెద‌వి విరుస్తున్నారు. దాదాపు 15 ఏండ్లు అధికారానికి దూరం అవ‌ట‌మే అస‌లు కార‌ణం కావ‌చ్చు అని తేల్చేస్తున్న నేత‌లూ ఉన్నారు.

ఇక‌, టీడీపీ అబ్య‌ర్థుల కోసం చంద్ర‌బాబు… గ్రేట‌ర్ ప‌ర్య‌ట‌న‌పై ఇంకా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. రాహుల్ తో క‌లిసి రోడ్ షోల‌లో పాల్గొనాల్సి ఉన్నా,  ఆత‌ర్వాత కూడా ప్ర‌చారంలో  ఉండాల‌ని టీడీపీ నేత‌లు గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు. అప్పుడే… టీఆర్ఎస్ రోడ్ షోలు, కేసీఆర్ ప‌రేడ్ గ్రౌండ్ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని నేత‌లు చంద్ర‌బాబును కోరుతున్నారు. దీంతో… ఆయ‌న కూడా త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుందామ‌ని స‌ర్ధిచెప్పార‌ట‌.

మొత్తంగా… తెలంగాణ తెలుగుదేశం నేత‌లు త‌మ‌ను తాము ఎక్కువ‌గా ఊహించుకుంటూ, ముందే ఎదేదో ఊహించుకుంటున్నాని ఇత‌ర పార్టీలు విమ‌ర్శిస్తున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*