ఫైన‌ల్లీ… సెంట్ అవుట్.

Read Time: 0 minutes

కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వం, అబ్య‌ర్థుల ఎంపిక‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసినా… రంగారెడ్డి జిల్లా పార్టీ అద్య‌క్షుడు క్యామ మ‌ల్లేష్ ను ప‌ద‌వి నుండి త‌ప్పించింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌ల‌పాలు నిర్వ‌హిస్తున్నందున క్యామ మ‌ల్లేష్ ను త‌ప్పించారు.

కాంగ్రెస్ లో సీట్లు అమ్ముకుంటున్నారు, న‌న్ను కూడా స్క్రీనింగ్ క‌మిటీ చైర్మ‌న్ కొడుకు 3 కోట్లు లంచం అడిగిండు అంటూ బ‌య‌ట‌పెట్టి సంచ‌ల‌నం సృష్టించారు. దానికి సంబందించిన ఆడియో టేపుల‌ను, రాష్ట్ర పార్టీ కీల‌క నేత‌ల‌ను నోటికొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని ఆయ‌న పై ఆరోప‌ణ‌లున్నాయి.

అయితే, ఆయ‌న ఆరోప‌ణ‌లు చేసిన రోజే… స‌స్పెన్ష‌న్ వేటు ప‌డుతుంద‌ని అంతా భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఆ త‌ర్వాత క్యామ మ‌ల్లేష్ కూడా కామ్ అయిపోయినా, పార్టీ ఆయ‌న‌పై చ‌ర్య‌లు చేప‌ట్టింది. మొద‌ట‌గా ఆయ‌న్ను ప‌ద‌వి నుండి త‌ప్పించి, మంగ‌ళ‌వారం రాత్రిలోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. ఆ వివ‌ర‌ణ‌పై సంతృప్తి చెంద‌క‌పోయినా… వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోయినా… ఆయ‌న్ను పార్టీ నుండి స‌స్పెండ్ చేసే అవ‌కాశం ఉంది.

ఈ చ‌ర్య ద్వారా… పార్టీని విమ‌ర్శించే నేత‌ల‌తో పాటు, రెబ‌ల్ గా ఉన్న అబ్య‌ర్థుల‌కు గ‌ట్టి సిగ్న‌ల్ పంపించిన‌ట్ల‌యింది. క్యామ మ‌ల్లేష్ కొన్ని నిర్ధిష్ట ఆరోప‌ణ‌లు చేశారు. ఖైర‌తాబాద్ టికెట్ విష‌యంలో చేతులు మారిన 10 కోట్ల‌తో పాటు, క్యామ మ‌ల్లేష్ ను అడిగారాని చెప్పిన 3 కోట్ల రూపాయాల ఆరోప‌ణ‌ల‌పై పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం కూడా ఆరా తీసిన‌ట్లు తెలుస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*