బండ్లా గ‌ణేష్‌… అద్య‌క్ష క‌లల‌కు గండి.

Read Time: 0 minutes

సినీ న‌టుడు, బడా నిర్మాత బండ్ల గ‌ణేష్ ఆశ‌ల‌కు గండి ప‌డింది. నేను అసెంబ్లీ మెట్లు ఎక్కాల్సిందే… స‌భ‌లో అద్యక్ష అనాల్సిందే అంటూ ఈ మ‌ద్య తెగ హ‌డావిడి చేశాడు. ఎలా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాడో… చేసి చూపించాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బండ్ల గ‌ణేష్ కు టికెట్ నిరాక‌రించింది.

ఎంత డ‌బ్బుంటే ఏం లాభం… జ‌నంతో ఉన్న నాయ‌కుడ‌యితేనే గెలిచి వ‌స్తాడు. కాంగ్రెస్ కూడా బండ్ల గ‌ణేష్ విష‌యంలో అదే ఆలోచించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. బండ్ల గ‌ణేష్ రెండు చోట్ల నుండి టికెట్ ఆశించాడు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మ‌యిన షాద్ న‌గ‌ర్ తో పాటు, జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం. షాద్ న‌గ‌ర్ లో ఆయ‌న బిజినెస్ ఉంది. కానీ అక్కడ సీనీయ‌ర్ నేత ప్ర‌తాప్ రెడ్డికి టికెట్ కేటాయించారు. షాద్ న‌గ‌ర్ రాకున్నా… జూబ్లిహిల్స్ అయినా ఇస్తారు అనుకున్నా, ఆ సీటును పీజెఆర్ కొడుకు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డికి కేటాయించ‌టంతో… బండ్ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్ల‌యింది. ఇక ఇప్పుడు త‌న ఆశ రాజేంద్ర‌న‌గ‌ర్ వైపు మ‌ళ్లీ న‌ట్లు క‌న‌ప‌డుతోంది. అక్క‌డ స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఆ సీటు కోసం తీవ్రంగా ఓత్తిడి తెస్తుండ‌టంతో… ప్ర‌స్తుతానికి ఆ సీటును కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది. ఇక ఆ సీటు కోసం టీడీపీ కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ పై ప్రెష‌ర్ చేస్తోంది. దీంతో… బండ్ల గ‌ణేష్ కు ఆ సీటు ద‌క్క‌టం కూడా  అనుమాన‌మే.

దీంతో… బండ్ల గ‌ణేష్, సినిమాల్లో అయితే క‌మెడియ‌న్ పాత్ర నుండి… ఎలాగోలా పైకి వ‌చ్చి, పెద్ద హీరోల‌తోనే సినిమా తీసే రేంజ్ కు అయితే వ‌చ్చారు కానీ, రాజ‌కీయాల్లో కూడా క‌మెడియ‌న్ లా మిగిలిపోతాడో… సినిమాల్లో లాగే, రాణించి పెద్ద స్థాయికి వ‌చ్చి… అసెంబ్లీలో అద్య‌క్ష అంటారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*