బాత్ ట‌బ్ లో రాయ‌ల‌సీమ ల‌వ్ స్టోరీ…

Read Time: 1 minutes

తెలుగులో అందాల ఆర‌బోత సినిమాల ప్ర‌వాహం ఎక్కువైంది. ముఖ్యంగా… చిన్న సినిమాల‌న్నీ కుర్ర‌కారును టార్గెట్ చేసుకొనే వ‌స్తున్న‌ట్లు క‌న‌పడుతోంది. ఇప్ప‌టికే ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమా త‌ర్వాత‌, ఈ త‌ర‌హా సినిమాలు మ‌రింత ఘాటుగా … మాస్ మ‌సాలా జోడించి వ‌స్తున్నాయి.

తాజాగా ప్రేక్ష‌కుల‌కు ముందుకు రాబోతున్న రాయ‌ల‌సీమ ల‌వ్ స్టోరీ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా అడ‌ల్ట్ సినిమాగానే రాబోతుంది. దీపాశ‌లి కానుక‌గా… ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాయ‌ల‌సీమ ల‌వ్ స్టోరీ టీజ‌ర్… రోమాన్స్ తో నింపేశారు. బాత్ టబ్ లో హీరో, హీరోయిన్లు నగ్నంగా కామక్రీడల్లో తేలిపోతూ శృంగార రసాన్ని పండించారు. ఆ తరువాత హీరోయిన్.. హీరోని కొట్టి తనను మర్చిపోమని చెప్పడంతో టీజర్ ఎమోషన్ టర్న్ తీసుకుంది.

కమెడియన్ పృధ్వీ.. లెక్చరర్ పాత్రలో ‘ఇదిగో మీ లాంటి ఎదవల వల్లే.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి.. నిర్భయ కేసులు ఎక్కువైపోయాయ్’ అంటూ పంచ్‌లు పేల్చుతున్నాడు. పోస్టర్ తో హడావిడి చేసిన చిత్రబృందం ఇప్పుడు టీజర్ తో మరింత హీట్ పెంచేస్తున్నారు. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*