బాలీవుడ్ ఓల్డ్… హాట్ ఆంటీ వెంట‌ప‌డుతోన్న కుర్ర‌హీరో…

Read Time: 0 minutes

బాలీవుడ్ లో అందాలు ఆర‌బోసే  తార‌ల‌కు కొద‌వేమీ లేదు. ఎప్ప‌టి నుండో… ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త తార‌లు తెర‌పైకి వ‌స్తున్నా, కొంత‌మంది తార‌ల అందం, ఆ పేరు విన్నా ఇప్ప‌టికీ… జ‌నం ఔరా అంటారు. ఇప్పుడు ఆ ఓల్డ్ ఆంటీ వెంట‌ప‌డుతున్నాడో కుర్ర‌హీరో.

అయితే… ఆ బ్యూటీ కూడా కుర్ర‌హీరోకు ఒకే చెప్పేసింది. ఇప్పుడు కాదు… గ‌త రెండు సంవత్స‌రాల నుండి వీరి ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌ట‌. ఎవ‌రి గురించి అనుకుంటున్నారా…. బాలీవుడ్ హాట్ బ్యూటీ మ‌లైక‌ ఆరోరా గురించి. మ‌లైక‌ ఆరోరా… యువ హీరో అర్జున్ క‌పూర్ ల మ‌ద్య రెండేండ్ల నుండి ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌ట‌. ఇప్పుడు వీరిద్ద‌రు వ‌చ్చే ఎప్రిలో పెళ్లికూడా చేసుకోబోతున్న‌ట్లు బాలీవుడ్ కోడైకూస్తోంది. మ‌లైకా… అర్జున్ క‌న్నా 12 సంవ‌త్స‌రాలు పెద్దది. అయినా… నాకు మ‌లైకానే కావాల‌ని అర్జున్ కపూర్ ప‌ట్టుబడుతున్నాడ‌ట‌. అయితే… ఇటీవ‌లే త‌న భ‌ర్త స‌ర్పాజ్ ఖాన్ కు మ‌లైక విడాకులు ఇచ్చింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ అర్జున్ ను పెళ్లిచేసుకునేందుకే స‌ర్పాజ్ కు విడాకులు ఇచ్చి ఉండొచ్చంటున్నారు బాలీవుడ్ ఇండ‌స్ట్రీ క్రిటిక్స్.

ప్ర‌స్తుతం… మ‌లైక‌కు బాలీవుడ్ లోపెద్ద‌గా ఆఫ‌ర్స్ లేవు. ఆమె తెర‌పై అడ‌పాద‌డ‌పా క‌న‌ప‌డ‌టం మిన‌హా… చాలా మంది హాట్ సినిమాల‌కు కూడా ఆమెను ప‌క్క‌న పెట్టేశారు. కానీ అర్జున్ క‌పూర్ చేతిలో ఇంకో మూడు సినిమాలు ఉన్నాయ‌ట‌. ఆ మూడు సినిమాలు ఏప్రిల్ క‌ల్లా పూర్తి చేసేసి…. మ‌లైక‌తో కొత్త జీవితం ప్రారంభించాల‌ని అర్జున్ త‌హ‌త‌హ‌లాడుతున్నాడ‌ని స‌మాచారం.

మ‌రీ.. .ఈ పెండ్లి అయినా చివ‌రి వ‌ర‌కు ఉంటుందో, యాధావిధిగా మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌గానే ముగుస్తుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*