బీజేపి స‌ర్కార్ పై చంద్రబాబు స‌ర్జిక‌ల్ స్ట్రైక్.

Read Time: 0 minutes

కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోన్న చంద్ర‌బాబు స‌ర్క‌ర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సమాఖ్య స్పూర్తిని కాపాడే ఉద్దేశంతో ఉన్న ఓ చిన్న లాజిక్ ఆధారంగా… సిబిఐ కానీ,ఏ ఇత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలు అయినా, చంద్ర‌బాబు స‌ర్కార్ అనుమ‌తి లేనిదే…. ఏపీలో ప్ర‌వేశించ‌రాదు, సోదాలు.. అరెస్టులు చేయ‌రాదు.

నిజానికి ఇదే… సంచ‌ల‌న నిర్ణ‌యం. ఈ నెల 8నే చంద్ర‌బాబు స‌ర్కార్ అధికారిక జీవో కూడా జారీ చేసింది. ఈ మ‌ద్య కుట్ర‌పూరితంగా త‌మ‌పై సీబీఐ, ఈడీ, ఐటీల‌ను దాడుల‌కు పంపుతున్నార‌ని మండిప‌డుతోన్న చంద్ర‌బాబు, దానికి విరుగుడుగా ఈ జీవో జారీ చేశారు. ఈ జీవో ప్ర‌కారం… కేంద్ర దర్యాప్తు సంస్థ‌లు ఏవైనా డిల్లీ ప‌రిధి దాటి, ఇత‌ర రాష్ట్రాల్లోకి వెళ్లాల‌న్న ఆ ప్ర‌బుత్వ అనుమ‌తి ప‌త్రం త‌ప్ప‌నిసరి. ఇప్ప‌టికే ఏపీ త‌రుపున ఆ అనుమ‌తి ప‌త్రం ఉంది. ఇప్పుడు ఏపీ ఆ అనుమ‌తి ప‌త్రాన్ని ర‌ద్దు చేసింది. త‌ద్వారా… వారు ఏపీ భూభాగంలోకి రావాలంటే ఏపీ ప్ర‌భుత్వ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అన్న‌మాట.

కేంద్ర ప్ర‌భుత్వం జేబు సంస్థలుగా సిబిఐని, ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మార్చాయ‌ని… ఇటీవ‌లి ప‌రిణామాలు అదే విష‌యాన్ని తెలియ‌జెస్తున్నాయి కాబట్టి… రాజకీయ కుట్ర‌పూరిత చ‌ర్య‌ల‌ను తాము అనుమ‌తించం అన్న‌ది చంద్ర‌బాబు స‌ర్కార్ మాట‌. దీంతో… ఇప్పుడీ విష‌యం దేశ‌వ్యాప్త దుమ‌రానికి దారితీసింది. పైగా… కేంద్రం పెత్త‌నం స‌హించ‌ని… మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి నాయ‌కుల‌కు ఇదో కొత్త అస్త్రంగా మారింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*