బీసీలు స‌రే.. మ‌హిళా సంఘాలు లేవా.

Read Time: 0 minutes

టీఆర్ఎస్ అబ్య‌ర్థులు సీట్లు కేటాయించిన‌ప్పుడు గుర్తుకు రాని… కులాలు, సామాజిక స‌మీక‌ర‌ణాల‌పై చర్చ‌, కాంగ్రెస తొలిజాబితా విడుద‌ల చేయ‌గానే… మాత్రం ఎందుకు ఇంత పెద్ద రచ్చ అవుతుంద‌న్న ప్ర‌శ్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తోంది. ఏ పార్టీ అయినా… గెలిచే వారికే క‌దా టికెట్లు ఇచ్చేది, ఎందుకీ చర్చ‌… అంటున్నారు వారు.

ఓ బీసీ మ‌హిళ‌కు, మాజీ మంత్రికి టికెట్ ఇవ్వ‌లేదు టీఆర్ఎస్ పార్టీ. ఓ ద‌ళిత ఎమ్మెల్యేకు, ద‌ళిత మ‌హిళా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వ‌లేదు. అయినా… ఏ ఒక్క సంఘం నోరు విప్ప‌లేదు. మీరు బీసీల‌కు ఇవ్వ‌రా అని నోరెత్త‌లేదు. అంతెందుకు… ఒక్క‌రంటే ఒక్క‌రు మ‌హిళా మంత్రి లేకున్నా స‌ప్పుడు చేయ‌ని వారు, ఇప్పుడు కాంగ్రెస్ జాబితా పై మాత్రం రాద్దాంతం చేస్తున్నారు. ఎన్నిక‌ల వేళ చ‌లికాచుకునే ప‌ని అని చాల స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. అంతెందుకు మొదటి జాబితాలో కాంగ్రెస్ చాలామందికే మ‌హిళ‌ల‌కు టికెట్లు ఇచ్చింది. మ‌రీ.. బీసీల‌కు టికెట్లు ఇవ్వ‌లేదు అని తిట్టిన నోర్లు, మ‌హిళ‌ల‌కు ఇచ్చినందుకు ఎందుకు పొగ‌డ‌టం లేదు….స‌హ‌జంగానే ఈ ప్ర‌శ్న‌లు వ‌స్తూనే ఉంటాయి. ఆ పార్టీ నాయ‌కుడు కాదు… కానీ, బీసీల‌కు టికెట్లు ఇవ్వ‌నందుకు ఏకంగా బంద్ కాల్ ఇచ్చాడంటే… తెర‌వెనుక ఏం జ‌రుగుతుందో అర్థం చేసుకోవాలి. పైగా, మొత్తం అబ్య‌ర్థుల ప్ర‌క‌టన అయినా జ‌రిగిందా అంటే అదీ లేదు. 95లో 65 ప్ర‌క‌టించారు. ఇంకా 30సీట్లున్నాయి… అంటే కావాల‌నే, కాంగ్రెస్ ను కార్న‌ర్ చేసే ఉద్దేశం క‌న‌ప‌డుతోన్నా, పార్టీలో ఉన్న నేత‌లు గానీ, ముఖ్యంగా బీసీ నేత‌లు గానీ… మాకేందుకులే అని ఊరుకుంటున్నారు త‌ప్పా, ఎ ఒక్క‌రు ముందుకు వ‌చ్చి… పార్టీ వాయిస్ చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దీంతో పార్టీలోని ఇత‌ర సామాజిక వ‌ర్గాల నేత‌ల‌తో పాటు, కార్య‌క‌ర్త‌లు ఫైర్ అవుతున్నారు. ఇలా అయితే, పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతోంద‌ని…. కేసీఆర్ వ‌ల‌లో ప‌డిన‌ట్లుగా మావాళ్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారంటున్నారు కార్య‌క‌ర్త‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*