మంద‌కృష్ణ చెప్పిన ఏపీ–తెలంగాణల మ‌ద్య వ్య‌త్యాసం.

Read Time: 1 minutes

ఎమ్మార్పీఎస్ మంద‌కృష్ణ మాదిగ‌… ఖ‌మ్మం స‌భ‌లో కేసీఆర్–చంద్ర‌బాబుకు మ‌ద్య తేడాను, రెండు తెలుగు రాష్ట్రాల మ‌ద్య ఉన్న తేడాను అద్బుతంగా చెప్ప‌టంతో… స‌భ‌కు వ‌చ్చిన జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

మంద‌కృష్ణ లేవ‌నేత్తిన అంశాలు…

1. తెలంగాణ‌లో మాల‌లు, మాదిగ‌ల‌కు క‌నీసం మంత్రి ప‌ద‌వులు కూడా ఇవ్వ‌లేదు. ఆంద్రాలో మంత్రి ప‌ద‌వులైన ద‌క్కి, ద‌ళితులకు కొంతైనా న్యాయం ద‌క్కింది.

2. కేసీఆర్ అధికారం కోసం ద‌ళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అని మాట త‌ప్పారు. అందుకే కేసీఆర్ ను ఓడించాల‌ని పిలుపునిచ్చాడు.

3. తెలంగాణ రావ‌టానికి ఇద్ద‌రు మ‌హిళ‌లు కార‌ణం. ఒక‌రు సోనియాగాంధీ అయితే, మ‌రోక‌రు లోక్ స‌భ‌లో బిల్లు పాస‌య్యేలా కృషి చేసిన ద‌ళిత బిడ్డ మీరా కుమార్. కానీ… తెలంగాణ‌లో ఒక్క మ‌హిళ‌కు కూడా మంత్రివ‌ర్గంలో చోటివ్వ‌ని నేత కేసీఆర్  అంటూ మండిప‌డ్డారు. కానీ ఏపీలో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను మంత్రుల‌ను చేశారంటూ తెలిపారు.

4.తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం బ‌త‌కాల‌న్నా, ప్ర‌జా ప్ర‌భుత్వం కొన‌సాగాల‌న్నా… కేసీఆర్ కుటుంబాన్ని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ ద‌ళితులంతా… కూట‌మికే ఓటేయాలంటూ పిలుపునిచ్చారు.

5. తెలంగాణ ఉద్య‌మంలో మిలియ‌న్ మార్చ్, సాగ‌ర హ‌రం చేసిన‌ప్పుడు ఏపీ ప్ర‌భుత్వం కూడా కోదండ‌రాం ను అరెస్ట్ చేయ‌లేదు. కానీ… తెలంగాణ‌లో కోదండ‌రాం ను ఎన్నో సార్లు అరెస్టు చేశార‌ని, పౌర‌హ‌క్కుల నేత‌గా… దేశం మొత్తం కీర్తించ‌బ‌డే… హ‌ర‌గోపాల్ గారిని వ‌ద‌ల్లేదు. తెలంగాణ‌లో నిర్బందం ఎంత‌గా ఉందంటే… ఇదే నిర్భందం ఉమ్మ‌డి ఏపీలో ఉంటే తెలంగాణ వ‌చ్చేది కాద‌ని… ఆయ‌న బాధ‌ప‌డ్డార‌ని చెప్పారు.

ప్ర‌పంచంలో ఎంద‌రో నియంత‌ల‌కు ప‌ట్టిన గ‌తే… కేసీఆర్ కు ప‌ట్ట‌బోతుంద‌ని, ఆయ‌న కుటుంబాన్ని చిత్తుచిత్తుగా ఓడించి… మ‌న ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడాలంటూ ద‌ళితుల‌కు మంద‌కృష్ణ పిలుపునిచ్చారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*