మా హీరో జోలికి రావ‌ద్దంటూ… ర‌కుల్ కు ఫ్యాన్స్ సీరీయస్ వార్నింగ్.

Read Time: 0 minutes

ఒక‌ప్పుడు ఎమైతేనేం… ఇప్పుడేంది అనేదే కీల‌కం. గ‌తంలో స్టార్ హీరోయిన్ హైప్ వ‌చ్చినా, ప్లాప్ ల‌లో కూడా స్టార్ గా నిలిచిన భామ ర‌కుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఆమె కెరీర్ దాదాపు ముగింపుకు చేరింది. తెలుగులో అవ‌కాశాలు అస‌లే లేకుండా పోయాయి. ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ర‌కుల్, ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది.

కొంత‌కాలంగా… సోష‌ల్ మీడియాలో ర‌కుల్ పై అనేక ట్రోలింగ్స్ న‌డిచాయి. త‌న డ్రెస్సింగ్, త‌న ఆహ‌బావాల‌పై సీనీ ప్రేమికులంతా… ర‌కుల్ పై మండిప‌డ్డారు. ఇక బ‌య‌ట ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయ‌న్న టాక్ కూడా ఆమెకు నెగెటివ్ గా మారింది. అయితే, తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్… ర‌కుల్ పై మ‌రోసారి మండిప‌డేలా చేసింది. అగ్నీకి ఆజ్యం పోసిన‌ట్ల‌యింది. కొంత‌కాలంగా… తెలుగులో సీనీమాలు లేక‌పోవ‌టంతో, కోలీవుడ్ బాట‌ప‌ట్టింది. మంచి ప‌నిచేశావ్ అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేయ‌గా, తాజాగా రాజ‌మౌళి కొత్త సీనీమా మ‌ల్టీ స్టార‌ర్ పై ర‌కుల్ ఆల్ ద బెస్ట్ చెబుతూ చేసిన ట్వీట్  పై ఫాన్స్ మండిప‌డుతున్నారు.  ఆల్ ద బెస్ట్ అంటూ ట్వీట్ స‌రే కానీ, నువ్వేంత కాకా ప‌ట్టినా… నీకు రాజ‌మౌళి చాన్స్ ఇవ్వ‌రూ, నీకంతా సీన్ లేదంటూ కొంద‌రు ట్వీట్ చేయ‌గా, మీరు మా చ‌ర‌ణ్ జోలికి రావ‌ద్దూ…. మా తార‌క్ జోలీకి అస‌లే రావ‌ద్దూ… మీరు ఎవ‌రితో న‌టించినా, ప్లాప్ త‌ప్ప‌దంటూ మొఖం మీదే కొట్టిన‌ట్లు ట్వీట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ప్రొడ్యూస‌ర్స్, డైరెక్ట‌ర్స్… ఎవరైనా పెద్ద హీరోల స‌ర‌స‌న ర‌కుల్ ను ఎంపిక చేసినా, ఫాన్స్ మాత్రం వెన‌క్కి త‌గ్గేలా లేరు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*