మిర్యాల‌గూడ‌లో జానాపై కార్య‌క‌ర్త‌ల ఫైర్ దేనికి సంకేతం.

Read Time: 1 minutes

మిర్యాల‌గూడే కాదు, న‌ల్గొండ అంతా జానారెడ్డికి ఉన్న ఫాలోయింగ్, బ‌లం-బ‌ల‌గం అందరికీ తెలుసు. ముఖ్యంగా మిర్యాల‌గూడ‌లో జానాను కాద‌ని గెలిచే ప‌రిస్థితి ఉండ‌దు. కానీ… అదే మిర్యాల‌గూడ‌లో జానాకు ఎదురైన తాజా సంఘ‌ట‌న దేనికి సంకేతం అన్న చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది.

నిజ‌మే… జానారెడ్డియే కాదు, ఎవ‌రూ జానాపై తిర‌గ‌బ‌డ‌తార‌ని ఊహించి ఉండ‌రు. కానీ కార్య‌క‌ర్త‌ల ఆక్రోశంలో కూడా ఎంతో కొంత నిజం ఉండే ఉండ‌వ‌చ్చు. జానారెడ్డి 2014లో లాగే… ఈసారి కూడా త‌న కుమారుడికి టికెట్ ఇవ్వాల‌ని కోరారు. కానీ సీరీయ‌స్ అధిష్టానం నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతో… ఆయ‌న కూడా మిర్యాల‌గూడ‌లో త‌న‌కు న‌మ్మ‌క‌స్తులు ఎవరా అని లెక్క‌లేసుకుంటున్న సంద‌ర్భంలో… జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల మీటింగ్ తో ఓ విష‌యం చాలా స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. మిర్యాల‌గూడ‌లో మిమ్మ‌ల్ని కాద‌ని గెల‌వ‌లేరు… కానీ స్థానికంగా, న‌మ్మ‌కంగా… ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే నాయ‌కునికి ఎమ్మెల్యే టికెట్ వ‌చ్చేలా చూడండి అని వారు కోరారు. నిజానికి నా చేతులో ఏమీ లేద‌ని జానా చెప్పినా…. ఆయ‌న్ని లెక్క‌లోకి తీసుకోకుండా… టికెట్ ఇవ్వ‌రు. అందుకే నా చేతుల్లో ఏమీ లేద‌ని ఎంత చెప్పినా… కార్య‌క‌ర్త‌లు విన‌లేదు. ఆయ‌న‌కే త‌మ నిర‌స‌న తెలియ‌జేశారు. అంటే… త‌న హుందాత‌నం అనేది నిలుపుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏమాత్రం తేడా చేసినా..  ఇప్పుడున్న మ‌ర్యాద కూడా జానాకు  పోయే ప్ర‌మాదం ఉంది. తాజా సంఘ‌ట‌న ఆయ‌న‌కు కూడా అంతుచిక్క‌లేద‌ని,  ఓ రకంగా షాకింగ్ న్యూసేన‌ని ఆయ‌న అనుచ‌ర‌లంటున్నారు. అయితే, మిర్యాల‌గూడ కార్య‌క‌ర్త‌లు కూడా… త‌మ ఆక్రోశంలోనూ జానాపైనే బాధ్య‌త పెట్టార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

అయితే, తాజా ఘ‌ట‌న త‌ర్వాత జానా వేసే స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*