మిర్యాల‌గూడ అమృత సంచ‌ల‌న వాఖ్య‌లు.

Read Time: 0 minutes

మిర్యాల‌గూడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన మిర్యాల‌గూడ ప్రేమ వివాహంలో… న‌న్ను కూడా చంపేస్తారంటూ అమృత సంచ‌ల‌న వాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టికే ప్ర‌ణ‌య్ ను చంపిన వారు, ఇప్పుడు న‌న్ను, నా కుటుంబ స‌భ్యుల‌ను చంపేందుకు ప్ర‌యోత్నిస్తున్నారేమో అంటూ అనుమానం వ్య‌క్తం చేసింది.

న‌ల్గొండ  జిల్లా మిర్యాల‌గూడ ప‌ట్ట‌ణంలో… ప‌రువు హ‌త్య సంగతి తెలిసిందే. అయితే… ఆ కేసులో అమృత తండ్రి మారుతీరావుతో పాటు మ‌రికొంత మందిపై పీడీయాక్ట్ న‌మోద‌యింది. వారు ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ జైల్లో ఉన్నారు. అయితే… తెల్ల‌వారు జామున ఓ ముసుగేసుకున్న వ్య‌క్తి… ఇంటి ముందుకు వ‌చ్చాడ‌ని, గోడ ఎక్కి బాల్క‌నిలోకి కూడా వ‌చ్చాడ‌ని… అమృత పోలీసుల‌కు కంప్లైంట్ చేసింది. అదే స‌మ‌యంలో పోలీసులు అటు రావ‌టంతో… స‌ద‌రు వ్య‌క్తి ప‌రారైయ్యాడ‌ని, త‌నను కూడా చంపేందుకు కుట్ర‌లు చేస్తున్నారేమోన‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేసింది అమృత‌. దీనిపై ప్ర‌ణ‌య్ తండ్రి… అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా,  ముసుగు వ్య‌క్తి  అక్క‌డ తిర‌గ‌టం సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డ‌యింది. దీంతో పోలీసులు ఆ వ్య‌క్తిని ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు.

అమృత ప్ర‌స్తుతం 6 నెల‌ల గ‌ర్భావ‌తి కాగా, మ‌ళ్లీ మాపై రెక్కీ నిర్వ‌హించుతున్నార‌న్న సంగ‌తి ఆలోచిస్తేనే త‌ట్టుకోలేక‌పోతున్నాం అని, ఇప్ప‌టికే ప్ర‌ణ‌య్ ను చంపి ఏం సాధించార‌ని… ఇప్పుడు నన్ను చంపేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌ని అమృత ప్ర‌శ్నిస్తోంది. జైల్లో ఉన్న‌వారే తాజాగా స్కేచ్ ల‌కు కార‌ణం అవుతున్నారు అని, ఆమె తండ్రిపై అమృత అనుమానం వ్య‌క్తం చేసింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*